TTD free Meals : సీఎం, మంత్రులును పురుగులు పట్టి పోతారు అని శాపనార్ధాలు.. 

TTD free Meals : తిరుమలలో అన్నదానానికి 500 యేళ్ళ క్రితమే పునాది పడింది. తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కోసం తరలివస్తున్న భక్తులకు రోజూ సుమారు లక్షకు పై చీలుకు మందికి ఉచితంగా భోజనం వడ్డిస్తున్న వైభవాన్ని నేడు కనులారా వీక్షిస్తున్నాం. తిరుమలలో ఎవరూ ఆకలితో ఉండకూడదన్నది తితిదే లక్ష్యం. అందుకే ఏ సమయంలో భోజనానికి వెళ్ళినా దొరికే ఏర్పాటు చేశారు. ఉదయం అల్పాహారం కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా నేటి రాష్ట్ర ప్రభుత్వం తితిదే లో వడ్డించే అన్నం ఒక్కసారి వారే స్వయంగా తిని చూడాలని.. తింటే మిగతా వారి బాధ అర్థం అవుతుంది అంటూ శాపనార్ధాలు పెట్టారు ఓ భక్తుడు.. 

తిరుమల తిరుపతికి శ్రీవారిని దర్శించిన ప్రతి ఒక్కడికి అన్న ప్రసాదం ఉచితంగా అందిస్తారు. అయితే ఈ అన్న ప్రసాదంలో వడ్డిస్తున్న బియ్యం రేషన్ బియ్యం అని.. అది తింటున్న భక్తుడు స్వయంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ రేషన్ బియ్యం అన్నం నిండా పురుగులు ఉన్నాయని భక్తులు వాటిని తినడానికి ఇబ్బందులు పడుతున్నారని.. భక్తులు హుండీలో వేసే డబ్బులను కూడా వారి జేబుల్లోకి వేసుకొని భక్తులను ఇలా ఇక్కట్లకు గురి చేయడం సరికాదని.. ఒక్కసారి ఈ తిరుమలలో పెడుతున్న అన్నాన్ని సీఎం , మంత్రులు, మినిస్టర్స్, చైర్మన్లు , తిరుమల తిరుపతి దేవస్థాన సిబ్బంది కూడా ఒకసారి తింటే వారికి ఈ బాధ తెలుస్తుంది. ఈ బియ్యం భక్తులకి భోజనంగా పెట్టిన వాళ్ళందరూ పురుగులు పట్టి నాశనం అవుతారు అంటూ ఓ భక్తుడు శపించాడు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియో పై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

ఆ వెంకటేశ్వర స్వామి సొమ్ము తిన్న వాళ్ళు, ఆయన జోలికి వెళ్ళినవారు ఎవరైనా సర్వనాశనం అవుతారని… ఓం నమో వెంకటేశాయ అని భక్తులు కామెంట్స్ చేస్తున్నారు. దేవుడి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరి ఆకలి తీర్చడానికి తితిది ముందుంటుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అక్కడ జరిగేది మాత్రం గోరంత.. ప్రచారం మాత్రం కొండంత.. ఫైవ్ స్టార్ హోటల్ లాంటి భోజనం అందిస్తున్నామని మీడియాలో ఊదర గొడుతున్నారు. కానీ చేతల్లో అది లేదంటూ సామాన్య భక్తులు వాపోతున్నారు.

మరో భక్తుడు ఒకప్పుడు అందరం రేషన్ బియ్యం తినే కదా బతికింది. ఇప్పుడు ఒక్కరోజు ఇక్కడ రేషన్ బియ్యం తింటే ఏమవుతుంది. పెట్టడం అవసరమా అంటూ కామెంట్ చేశాడు. కానీ సామాన్య భక్తుడు కూడా తిరుపతి వెళ్ళినప్పుడు మంచి భోజనాన్ని తిని చక్కటి అనుభూతితో ఇంటికి రావాలన్నదే ఉద్దేశం. అలాంటప్పుడు మళ్ళీ రేషన్ బియ్యం వారికి అందించడంలో ఉపయోగం లేదు కదా. ఏది ఏమైనా సరే తీతిదే ఇకనుంచి అయినా మంచి బియ్యాన్ని అన్న ప్రసాదంగా ఇస్తే మహా ప్రసాదంగా భావిస్తారు. భక్తులు అది జరగాలని అందరం కోరుకుందాం.