Tspsc Exam Paper Leak case : టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారానికి సంబంధించి సిట్ దర్యాప్తులో కొత్త వ్యక్తుల జాబితా బయటపడుతోంది. లీకేజ్ కేసులో నిందితులు ఎంతో పకడ్బందీగా ప్రశ్నాపత్రాలను పంచుకొని లాభపడ్డారనేది దర్యాప్తు అధికారులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వాట్సప్ ద్వారానే గ్రూప్-1 ప్రశ్నపత్రాలు పలువురి చేతులు మారినట్టు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో 19 మంది సాక్షుల నుంచి లీకేజీకి సంబంధించిన కీలక సాక్ష్యాధారాలు సిట్ బృందం సేకరించింది. కాగా ఈ అంశంపై ప్రియా చౌదరి ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన నిజాలు బయటపెట్టారు.

పేపర్ లీకేజ్ కేసులో నలుగురు నిందితుల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు కానీ.. ఈ నిందితులు ఇంతలా తప్పు చేస్తున్నారంటే దాని వెనకమాల ఉన్న యాజమాన్యం అంతా అప్పటివరకు కళ్ళు మూసుకుని వ్యవహరించిందా అని ప్రియా చౌదరి అన్నారు. కచ్చితంగా ఇదంతా జరుగుతుంటే యాజమాన్యం ఏం చేస్తోందని ఆమె ప్రశ్నించారు. వాళ్ళకి తెలియకుండా ఇదంతా జరుగుతుందంటే నమ్మబుద్ధి కావడం లేదని తెలిపారు.
నిరుద్యోగ యువత భవిత ఈ ప్రశ్న పత్రాల పైనే ఆధారపడి ఉందని చెప్పనక్కర్లేదు. కానీ ఆ విషయాన్ని కూడా గాలికి వదిలేసి ఇలా లీక్ చేసిన తర్వాత స్పందించడం ఏ మాత్రం సరి కాదని ఆమె అన్నారు . ఎంతో మంది నిరుద్యోగ యువత గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది కొన్నేళ్ల నుంచి ఈ ఉద్యోగం కోసం అహర్నిశలు ప్రయత్నిస్తూ ఉంటారు. ఊరిలో కూలి పని చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ బిడ్డల్ని మంచి ఉద్యోగంలో చూడాలని ఎంతో కష్టపడుతూ ఉంటారు. అలాంటి వారందరి ఆశలపైన ఈ ప్రశ్న పేపర్ లీకేజ్ అనేది నీళ్లు చల్లింది.
గ్రూప్ వన్ పరీక్షా పత్రాల పేపర్ లీకేజీ అంటే విషయం కాదు. పేపర్ బయటకు రావడం కూడా అంతా సులువు కాదు. కచ్చితంగా దీన్ని వెనకమాల పెద్దపెద్ద వారి హస్తాలే ఉన్నాయని ప్రియా చౌదరి అన్నారు ప్రస్తుతం మనం చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.