ఇపుడు ఎక్కడ చూసినా ఆదిపురుష్ మానియానే కనిపిస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాపైనే భారీగానే అంచనాలు వున్నాయి. వచ్చే నెల అనగా జూన్ 16న సినిమా రిలీజ్ ఉండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసారు. ఈ నేపథ్యంలో నిన్న విడుదల అవుతున్న ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. అయితే కొన్నాళ్ల క్రితం రిలీజైనటువంటి టీజర్ తో పోల్చుకుంటే ట్రైలర్ అదిరిపోయిందంటూ కామెంట్స్ వస్తున్నాయి. దాంతో రెబల్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా లేడీ ఫాన్స్ అయితే చిందులేస్తున్నారు.
ఆదిపురుష్ టీజర్ రిలీజ్ అయినపుడు ఓ రేంజులో ట్రోలర్స్ విరుచుకుపడ్డారు. మరీ ముఖ్యంగా సీజీ విషయంలో అందరూ పెదవి విరిచారు. ఆ మైనస్ ని ఇపుడు చిత్ర యూనిట్ భర్తీ చేసిందని చెప్పుకోవాలి. టీజర్ రిలీజ్ సమయంలో ట్రోలర్స్ తో పాటుగా అంటి ఫాన్స్ కూడా రెచ్చిపోయారు. ఓ వర్గంవారు ప్రభాస్ పని అయిపోయిందంటూ ట్రోల్స్ మొదలు పెట్టారు. అయితే తాజాగా ట్రైలర్ వచ్చేసరికి సీన్ అంతా రివర్స్ అయిపోయింది. అప్పుడు విమర్శించిన నోళ్లే నోళ్లెళ్లబెట్టి ట్రైలర్ పదేపదే చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభాస్ లేడి అభిమానులు యాంటీ ఫాన్స్ మరియు ట్రోలర్స్ పైన విరుచుకుపడుతున్నారు. డార్లింగ్ ప్రభాస్ ని కొట్టేవాడు ఇంకా పుట్టలేదు అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఇక ఆదిపురుష్ సినిమా ఇంతవరకు వున్న సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆన్ లైన్ మాధ్యమాల్లో ఆదిపురుష్ మోత మోగిస్తున్నారు.
ట్రైలర్ రిలీజ్ అనంతరం నెట్టింట జై శ్రీరామ్ అంటూ మనోళ్లు లక్షల్లో కామెంట్లు పెడుతున్నారు. ట్రైలర్ లో చూపించిన సన్నివేశాలు చూసి నెటిజనం ఫిదా అవుతున్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా ఆదిపురుష్ ట్రైలర్‌ని గొప్పగా వర్ణిస్తున్నారు. కాగా ఈ సినిమాకు భారీ తారాగణం పనిచేసారు. సైఫ్ అలీఖాన్, దేవదత్త నాగె, సన్నీ సింగ్ లను ఈ సినిమాలో భాగం చేయడంతో ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు రెబల్స్.