OTT:నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం 18 పేజెస్.. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది.. లవ్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయింది. కాగా ఈ సినిమా నేడు ఓటిటీలో స్ట్రీమింగ్ అవుతుంది..
18 పేజెస్ సినిమా నేటి నుంచి ఆహా, నెట్ ఫ్లిక్స్ ఓటిటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ధియేటర్ మిస్ అయిన వారు ఈ రోజు నుంచి ఓటిటీలో ఈ సినిమా చూడచ్చు. ఈ అద్భుతమైన ప్రేమ కావ్యం క్రిస్మస్ కి విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. బాక్స్ ఆఫీసు వద్ద భారీ కలెక్షన్స్ వసూలు చేసింది.
నిఖిల్ అనుపమల అందమైన ప్రేమకథ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థలు ఆహా, నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నాయి. థియేటర్ రన్ పూర్తి కావడంతో గత అర్ధరాత్రి నుంచి 18 పేజెస్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 18 పేజెస్ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరించారు.
డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకి కథను అందించారు. నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరించారు. గోపి సుందర్ అందమైన బాణీలు సమకూర్చాడు. ఇందులోని నన్నయ్య రాసిన అనే పాట ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది. ఈ సూపర్ హిట్ చిత్రాన్ని మీరు చూడండి.. ఇటీవల ఈ సినిమా సకేస్ మీట్ కూడా నిర్వహించారు.