Tollywood: ఒక్క సినిమా కోసం రాజమౌళి , సుకుమార్ , త్రివిక్రమ్ ఎంత తీసుకుంటారో తెలిస్తే ఐటీ అధికారులు జీప్ లు వేసుకుని బయలుదేరతారు !

Tollywood: ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ప్రపంచానికి తెలియకపోవచ్చు కానీ.. ఇప్పుడు తెలుగు సినిమా గురించే ప్రపంచం మాట్లాడుకునేలా చేసారు మన దర్శకులు.. బాహుబలి సినిమాతో తెలుగోడి సత్తా ఏంటో దేశమంతా మాట్లాడుకునేలాగా చేశారు రాజమౌళి. ఆ తరువాత RRR చిత్రంతో తెలుగోడి సత్తా ఏంటో ప్రపంచానికి పరిచయం చేశారు రాజమౌళి.. ఇక పుష్ప ఫీవర్ ప్రపంచ దేశాలకు కూడా పాకింది.. మొత్తానికి మన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ తెలుగు సినీ పరిశ్రమపై అంచనాలను పెంచేస్తున్నారు.. హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.. ఇంతకీ ఏ ఏ డైరెక్టర్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు ఇప్పుడు తెలుసుకుందాం..

Tollywood Directors who are take Highest remmunaration
Tollywood Directors who are take Highest remmunaration

టాలీవుడ్ ను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి. జక్కన్న బాహుబలి సినిమా చేసినందుకు వందకోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట. ఇక అదే రేంజ్ లో ఆర్ఆర్ఆర్ కు కూడా తీసుకున్నట్టు సమాచారం. ఇక తను తీయబోయే సినిమాలపై ప్రపంచ దేశాలు కూడా ఈగర్ వెయిట్ చేసేలా చేస్తున్నాడు జక్కన్న. అది రాజమౌళికే సాధ్యమని చెప్పుకోవాలి.
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కూడా ఒకరు. అల‌.. వైకుంఠ‌పురం హిట్ త‌రువాత రెమ్యున‌రేష‌న్ బాగానే పెంచేశారు. ఒక్కో సినిమాకు రూ.30 కోట్ల‌తో పాటు బిజినెస్‌లో వాటా కూడా తీసుకుంటున్నారు త్రివిక్ర‌మ్‌.

సుకుమార్ పుష్ప సినిమా ఫీవర్ ప్రపంచ దేశాలకు పాకెలా చేశాడు అనడంలో సందేహం లేదు.. రంగస్థలం సినిమా రూ.20 కోట్లు తీసుకోగా.. ప్రస్తుతం పుష్ప కి 23 కోట్లు రెమ్యునరేషన్ తోపాటు లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నారని సమాచారం.
కొరటాల శివ ఆచార్య చిత్రానికి 20 కోట్లు తీసుకోగా.. ఎన్టీఆర్ తో చేస్తున్న చిత్రానికి 30 కోట్లు డిమాండ్ చేస్తున్నారట.

ప్రస్తుతం ఫామ్ లో ఉన్న డైరెక్టర్ వంశీ పైడిపల్లి తమిళ హీరో విజయ్ తో చేసిన వరుస సినిమాకు గాను 15 కోట్లు తీసుకున్నారు.

బోయపాటి శ్రీను వినయ విధేయ రామ వరకు 10 కోట్ల తీసుకుంటే.. అఖండ క్రేజ్ తో డబుల్ రెమ్యూనరేషన్ పెంచేసాడు.
పూరి జగన్నాథ్ ఒక్కో సినిమాకి 10 కోట్ల మేర రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నారు.
సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒక్కో సినిమాకు 10 కోట్లు తీసుకుంటున్నారు.
శేఖ‌ర్ క‌మ్ముల కూడా ఒక్కో చిత్రానికి రూ.10కోట్లు తీసుకున్నారు.

మహానటి సూపర్ కావడం తో నాగ్ అశ్విన్ సినిమాకి 8 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.
మహేష్ తో తీసిన సర్కారు వారి పాట చిత్రానికి గాను పరశురామ్ 8 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు.
సరైన హిట్స్ లేని వివిివినాయిక్  సినిమాకి 7 కోట్ల వరకు తీసుకుంటున్నారు.