Daily Astrology : నేటి రాశి ఫలాలు.. 22 నవంబర్ 2022 మంగళవారం రాశి ఫలాలు..! 

Daily Astrology :  మేషం:
ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

వృషభం:
వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. నూతన వ్యాపారాలు విస్తరిస్తాయి. ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది.

మిధునం:
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. సంతాన అనారోగ్య సమస్యలు ఉంటాయి. తొందరపడి ఇతరులతో పోట్లాడడం మంచిది కాదు . ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.

కర్కాటకం:
వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. దూరపు బంధువుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

సింహం:
నూతన వాహనయోగం ఉన్నది . ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు . బంధుమిత్రులతో సఖ్యత గా వ్యవహరిస్తారు.

కన్య:
వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం తప్పదు. వ్యాపారంలో భాగస్వామి తో విభేదాలు కలుగుతాయి. ఖర్చుకు తగినంత ఆదాయం ఉండదు. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి.

తుల:
సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసి వస్తాయి.

వృశ్చికం:
ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో కానీ పూర్తికావు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. అవసరానికి ధనం చేతిలో నిల్వ ఉండదు.

ధనస్సు:
ధనపరంగా మరింత పురోగతి కలుగుతుంది. నూతన గృహం కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.

మకరం:
ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. మీ నిర్ణయాలకు తగిన ప్రశంసలు లభిస్తాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

కుంభం:
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.. వ్యాపారాలలో కొత్త సమస్యలు ఎదురవుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

మీనం:
దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. పనులలో శ్రమ పెరుగుతుంది . ధనపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి . బంధుమిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చికాకులు ఏర్పడతాయి.