Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో ఫేషియల్ రికగ్నిషన్ అమలు..!

Tirumala.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకొని భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం విశేషంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే లడ్డు ప్రసాదం, శ్రీవారి దర్శనం , గదుల కేటాయింపు తదితర అంశాలలో మరింత పారదర్శకత తెచ్చేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వచ్చే భక్తులకు గదుల కేటాయింపు క్యాష్ అండ్ డిపాజిట్ తిరిగి చెల్లించే కౌంటర్ల పేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అమలు చేయనుంది.

Tirumala temple sanctum to close as board decides to replace gold plating |  Latest News India - Hindustan Times

మార్చి ఒకటి నుంచి ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించనుంది టీటీడీ. ఇందులో భాగంగా మంగళవారం తిరుమలలోని గదుల కేటాయింపు కేంద్రాల వద్ద ప్రయోగాత్మకంగా కెమెరాలతో ఈ సాంకేతికతను పరిశీలించారు. అంతేకాదు గదులు ఖాళీ చేసేటప్పుడు కూడా గదులు పొందిన వారే వచ్చి మరోసారి ఫేస్ రికగ్నిషన్ చేయిస్తే కాష్ అండ్ డిపాజిట్ చెల్లిస్తారు. తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు కౌంటర్లు, క్యాషన్ డిపాజిట్ తిరిగి చెల్లించే కౌంటర్ల వద్ద వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లో టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి వచ్చే భక్తులకు ఈ సాంకేతికత సహాయంతో లడ్డూలు అందివ్వనున్నారు. త్వరలోనే ఈ పద్ధతిని పూర్తిస్థాయిలో అమలు చేస్తామని కూడా టీటీడీ అధికారులు చెబుతున్నారు.