THULASIMOKKA:ఆరోగ్యాన్ని పెంపొందించే తులసి మొక్క.. ఉపయోగాలు ఎన్నో..!!

హిందూ సంప్రదాయం ప్రకారం తులసి మొక్కను దేవతా స్వరూపంగా భావిస్తారు. ఇక ముఖ్యంగా హిందువులు ప్రతి రోజు కూడా ఉదయం , సాయంత్రం తులసి కోట దగ్గర పూజ చేసి తమ కోరికలను లక్ష్మీదేవితో విన్నవించుకుంటూ ఉంటారు . అయితే ఈ తులసి మొక్క సంపదకు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా పుట్టినిల్లు అని చెప్పవచ్చు. తులసి మొక్కను మనం ఆరోగ్యానికి ఉపయోగించడం వల్ల వైద్యుడు దగ్గరికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు అని చాలామంది చెబుతూ ఉంటారు. ఇంట్లో పెంచుకునే కొన్ని రకాల ఔషధ మొక్కలలో తులసి మొక్క కూడా ఒకటి. వీటిని పెంచుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలగవు.ఈ తులసి ఔషధ గుణాలు కలిగి ఉంటుంది కాబట్టి వ్యాధి తీవ్రతను కూడా తగ్గిస్తుంది.

ముఖ్యంగా తులసి మొక్కకు ఎంతో విశిష్టత ఉంది. తులసి ఆకులను ప్రతిరోజు ఉపయోగించడం వల్ల సీజనల్గా వచ్చే వ్యాధులను కూడా దూరం చేసుకోవచ్చు. దగ్గు ,జలుబు, గొంతులో గరగర వంటి సమస్యలకు తులసి దివ్య ఔషధం. ఇక తులసిలో మనకు కొన్ని రకాలు తెలిసి ఉన్నాయి.. అందులో రామ తులసి, కృష్ణ తులసి, వాన తులసి, కర్పూర తులసి వంటి రకాలు ఉన్నాయి. ముఖ్యంగా కర్పూర తులసిని ఎక్కువగా బాహ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ఇక ఈ తులసి నుంచి తీసిన నూనెను చెవి ఇన్ఫెక్షన్ తగ్గించడానికి సహాయపడుతుంది.

తులసి ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్, యాం టీ వైరల్ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. జ్వరం, శ్వాస సంబంధ సమస్యలను, జలుబును నయం చేయడంలో రామ తులసి బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇక అజీర్తి, కడుపులో మంట, నిద్రలేమి , మూర్చ, తలనొప్పి, కలరా వంటి అనారోగ్య సమస్యలకు తులసి చాలా బాగా సహాయపడుతుంది. చర్మ సమస్యలను దూరం చేయడంలో కూడా తులసి చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఎన్నో శాస్త్ర సంకేతాలను ముందే మనకు తెలియజేస్తుంది. కుటుంబ పెద్ద విషయంలో తులసి చెట్టు ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. కాబట్టి మొక్క ఎంత ఆరోగ్యంగా ఉంటే కుటుంబ పెద్ద కూడా అంత ఆరోగ్యంగా ఉంటాడు అని హిందువులు విశ్వసిస్తారు. ఏది ఏమైనా పవిత్రంగా భావించే ఈ మొక్క ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది అని చెప్పవచ్చు.