వేపాకుతో వెయ్యి లాభాలు. తెలిస్తే షాక్..!

పూర్వం నుంచి ఆయుర్వేద ఔషదాలు కలిగిన చెట్లను పూజించడం మన భారతదేశంలో తప్ప మరి ఎక్కడ లేదు. అలాంటి వాటిల్లో ప్రముఖమైనది వేప చెట్టు. ఇందులో ప్రతి భాగము ఆయుర్వేద గుణాన్ని కలిగి ఉంటుంది.ఇలాంటి వేప చెట్టు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం..

Advertisement

దంత సంరక్షణ:
వేపలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటాయి. వేప పుల్ల తో పళ్ళు శుభ్రం చేసుకోవడం వల్ల, అది బ్యాక్టీరియాను పళ్ళపై పేరుకుపోకుండా సహాయం చేస్తుంది. వేప యొక్క యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చిగురువాపును తగ్గించడానికి,తీవ్రమైన చిగుళ్ల వ్యాధి వల్ల వచ్చే చిగుళ్ల రక్తస్రావంను నివారించడానికి,నోటిలోని దుర్వాసనను తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

Advertisement

పొట్ట ఆరోగ్యానికి..
సాధారణంగా చిన్న పిల్లలో నులిపురుగులు వచ్చి, కడుపునొప్పితో బాధపడుతుంటారు. అలాంటి వారికి రోజూ కొంచెం వేపాకు మెత్తగా నూరి, చిన్న గోళీ సైజ్ లో మింగిస్తూ ఉంటే కడుపులో నులి పురుగులు సమస్య తగ్గిపోతుంది.వేపాకు కషాయం కూడా జీర్ణ సంబంధిత సమస్యల నివారణకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు, జ్వరాలకు మంచి మెడిసిన్ గా ఉపయోగపడుతుంది.

షుగర్ వ్యాధి తగ్గించడానికి..
వేప కషాయం రోజూ తీసుకోవడం వల్ల రక్తంలో ఇన్సులిన్ స్థాయిని క్రమబద్దీకరించడానికి సహాయపడుతుంది. వేపపువ్వు కూడా మధుమేహనికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మెంతులు, లేత వేప ఆకులు రుబ్బి, ఆ రసం వడకట్టి, చేదుగా వున్నప్పుడే రోజుకు రెండు పూటలా ఓ స్పూన్ చొప్పున తీసుకుంటూంటే, షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండి మధుమేహం తగ్గుముఖం పడుతుంది.

చర్మ సంబంధిత రోగాలకు..
చర్మ రోగాలకు వేప బెరడు చాలా బాగా ఉపయోగపడుతుంది. పల్లెల్లో ఇప్పటికి ఏదయినా చర్మ సమస్య వచ్చినప్పుడు, వేప బేరడు తీసుకొని, నీళ్ళు వేసి సాది, ఆ మిశ్రమాన్ని దానిపై లేపణంగా వేస్తారు. ఇందులో వున్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు వల్ల, గాయాలు తొందరగా నయం అవుతాయి. తట్టు లేక అమ్మవారు వచ్చినప్పుడు, వేపాకు బాగా నూరి, ఆ మిశ్రమాన్ని దానిపై లేపణంగా వేస్తారు. ఇలాంటివి చేయడం వల్ల తట్టు తొందరగా తగ్గిపోతుంది.

అందానికి..
మొటిమలు, మచ్చలతో బాధపడేవారు, వేపాకు, పసుపు వేసి బాగా నూరి, ఆ మిశ్రమాన్ని రోజూ ముఖానికి పూసుకోవడం వల్ల అవి ఇట్టే తగ్గిపోతాయి. కళ్ల కింద వచ్చే నల్లటి వలయాలకు రోజూ వేప నూనె రాయడం వల్ల, ఉపశమనం కలుగుతుంది.వేపాకు నూరి జుట్టు కుదుళ్లకు పట్టివ్వడం వల్ల,జుట్టు సమస్యలకు వేపాకు చాలా బాగా ఉపయోగపడుతుంది.

Advertisement