CBI : దేశవ్యాప్తంగా బ్యాంకుల అప్పుల పేరుతో దోచుకున్న వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని రాబట్టడానికి ప్రజాప్రతినిధులపై ఈడి, సీబీఐ దాడులు చేస్తూ ఉంది. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా బ్యాంకులు వద్ద రుణాలు తీసుకున్న ఎంపీలు మరియు మాజీ ఎంపీలలో అలజడి మొదలైంది. బ్యాంకు రుణాల ఎగవేత విషయంలో సీబీఐ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ప్రముఖ మాజీ ఎంపీని అరెస్టు చేయడం తెలిసిందే. 2014 ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ తరఫున గెలిచిన ఆ మాజీ ఎంపీ తర్వాత టీడీపీ లోకి వెళ్ళింది.
అయితే ఆ ఎంపీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి 42 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు. ఆ తర్వాత అప్పు చెల్లించకపోవడంతో…సీబీఐ గతంలో ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. ఆ తర్వాత విచారణ చేపట్టి.. కోర్టు ఆదేశాలు మేరకు ఆమెను ఇటీవల బెంగళూరులో అరెస్టు చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు ఇదే బాపత్తికి చెందిన కొంతమంది వైసీపీ ఎంపీలు ఉన్నారట. వారిలో టెన్షన్ మొదలైనట్లు ఏపీ రాజకీయాలలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వైసీపీ ఎంపీలలో ఒకరు ఢిల్లీలోనే గత కొంతకాలంగా ఉంటూ ఉన్నారట. దీంతో ప్రస్తుతం బ్యాంకుల వద్ద రుణాలు ఎగవేత విషయంలో ఎంపీలపై సీబీఐ చేస్తున్న దాడులకు.. ఢిల్లీలో ఉన్న సదరు వైసీపీ ఎంపీకి టేన్షన్ మొదలైనట్లు టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఆయనకు ఒక్కరికి మాత్రమే కాదు రాష్ట్రంలో ఉన్న పలువురు వైసీపీ ఎంపీలకి అస్సలు నిద్ర పట్టడం లేదట.
ఎప్పుడు సీబీఐ అధికారులు తమపై దాడులు చేస్తారో.. అనే టెన్షన్ లో ఏపీ అధికార పార్టీకి చెందిన ఎంపీలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బ్యాంకుల్లో అప్పులు తీసుకుని ఎగొట్టిన ఎంపీలు దేశవ్యాప్తంగా చాలామంది ఉండటంతో… వాళ్ళ లిస్ట్ బయటకు తీసి సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారట. ఈ తరహాలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్న వాళ్లు టీడీపీ ఓటమి తర్వాత బీజేపీ కండువా కప్పుకోవటం జరిగింది. వాళ్లపై కూడా సీబీఐ దాడులు చేస్తే కొన్ని వేల కోట్లు ప్రజాధనాన్ని రాబట్టిన వాలవుతారని మేధావులు అంటున్నారు.