స్మార్ట్ టీవీల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న కస్టమర్లకు థామ్సన్ కంపెనీ మంచి శుభవార్తను తీసుకొచ్చింది . ప్రస్తుతం క్యుఎల్ఈడి స్మార్ట్ టీవీ సీరీస్ లను పరిచయం చేసింది. ఇందులో మూడు రకాల స్మార్ట్ టీవీలను ప్రవేశపెట్టారు. ఇక ఈ మూడు మోడల్స్ కూడా డాల్బీ విజన్, డాల్బీ ఆటం, డిటిఎస్ 2 సరౌండ్ సౌండ్ లకు మద్దతునిస్తాయి. గూగుల్ టీవీ ని సపోర్ట్ చేసే ఈ స్మార్ట్ టీవీ యువత, పిల్లలను చాలా ఆకర్షణీయమైనా అనుభవాన్ని అందిస్తాయి. మరి ఈ స్మార్ట్ టీవీలో ఫీచర్స్ ఏమిటి? ధర ఏమిటి ?ఇలా అన్ని విషయాలను ఇప్పుడు చదివి తెలుసుకుందాం.
ప్రస్తుతం థామ్సన్ కొత్తగా ప్రవేశపెట్టిన స్మార్ట్ టీవీ సీరీస్ 50, 55, 65 అంగుళాల డిస్ప్లే సైజులలో లభిస్తుంది. ఇక ఈ స్మార్ట్ టీవీ సీరీస్ లోని అన్ని మోడల్స్ హెచ్డి ఆర్ టెన్ ప్లస్, డాల్బీ విజన్ ,డాల్బీ అట్మోస్ట్ అలాగే డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్టుతో 4L QLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. 50 మరియు 55 అంగుళాల మోడల్ గరిష్టంగా 550 నిట్ ల బ్రైట్ నెస్ ను అందిస్తాయి. ఇక 65 అంగుళాల మోడల్ గరిష్టంగా 600 నిట్ ల బ్రైట్నెస్ ను అందిస్తుంది. ఇక ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే ఈ స్మార్ట్ టీవీ సీరీస్ లోని అన్ని మోడల్స్ కూడా 40 W ఔట్ పుట్ తో రెండు స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటాయి.
డిటిఎస్ 2 సరౌండ్ సౌండ్ ని కూడా సపోర్ట్ చేస్తుంది. మీడియా టెక్ MT9062 ప్రాసేసర్ ను ఈ స్మార్ట్ టీవీలలో అందించబడింది. ఇక 2 GB ర్యామ్, 16 GB స్టోరేజ్ స్పేస్ ని కూడా కలిగి ఉంటుంది. ఓటీటీ యాప్స్ విషయానికి వస్తే .. నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో , డిస్నీ ప్లస్ హాట్ స్టార్ , ఆపిల్ టీవీ, ఊట్ , జి ఫైవ్ ,సోనీ లైవ్ వంటి 10000 కంటే ఎక్కువ యాప్లను కూడా సపోర్ట్ చేస్తాయి. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే .. బ్లూటూత్ 5.0, డ్యూయల్ బ్యాండ్ వైఫై, 3 హెచ్డిఎంఐ పోర్ట్ లు, 2 యు ఎస్ బి పోర్ట్ లను కూడా కలిగి ఉన్నాయి. ఇక ధరల విషయానికి వస్తే.. 50 అంగుళాల మోడల్ ధర రూ.33,999, 55 అంగుళాల మోడల్ ధర రూ.40,999 అలాగే 65 అంగుళాల మోడల్ ధర రూ.59,999 నిర్ణయించబడింది. బిగ్ బిలియన్ డేస్ లో వీటిపై ఆఫర్లు కూడా వచ్చే అవకాశం ఉంది.