Hair Problems : ఇటీవల కాలంలో తీసుకునే ఆహారంలో పోషకాల లోపం.. ఎండా.. కాలుష్యం.. దుమ్ము.. ధూళి.. తీవ్రంగా ఆలోచించడం.. నిద్రలేమి.. రక్తహీనత ఇలా పలు కారణాల వల్ల జుట్టు రాలే సమస్యలు అధికమవుతున్నాయి. అంతేకాదు జుట్టు విరిగిపోవడం.. నిర్జీవంగా మారడం .. చుండ్రు తో పాటు విపరీతమైన జుట్టు సమస్యలు మొదలు అవుతున్నాయి. ఇక వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు మొదలుకొని ప్రతి ఒక్కరికి జుట్టు రాలే సమస్యలు అధికమవుతున్నాయి. ఇక జుట్టు రాలడాన్ని ఆపడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్న విషయం కూడా మనకు తెలిసిందే.
అందుకే మార్కెట్లో దొరికే ఉత్పత్తులను తీసుకొచ్చి జుట్టుకు అప్లై చేస్తున్నారు. వీటి వల్ల కొంత వరకు ఉపశమనం కలిగినా..ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి ప్రతినెలా వీటిని కొనుగోలు చేయడం సాధ్యపడదు.అందుకే ఇప్పుడు ఒక పౌడర్ ను మీ ముందుకు తీసుకొస్తున్నాం దానిని ఎలా తయారు చేయాలో.. ఎలా అప్లై చేయాలో కూడా ఒకసారి చదివి తెలుసుకుందాం..దీని కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఉసిరి పొడి,2 టేబుల్ స్పూన్ల బృంగరాజ్ పొడి , 2 టేబుల్ స్పూన్ల బ్రహ్మి పొడి, 2 టేబుల్ స్పూన్ల అశ్వగంధ పొడి తో పాటు 2 టేబుల్ స్పూన్ల శంఖపుష్ప పొడి వేసుకొని.. అన్ని పొడులు బాగా కలిసేలా కలుపుకొని ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి.

ఈ పొడిని దాదాపుగా 20 రోజుల పాటు మీరు మీ జుట్టుకు వాడుకోవచ్చు.ఇక ఎలా వాడాలి అంటే.. మీరు అప్లై చేసుకోవాలనుకున్న ముందురోజు ఒక బౌల్లో ఈ పొడులన్నీ మీ జుట్టుకు సరిపడా తీసుకొని అందులో కొద్దిగా టీ డికాక్షన్ వేసి .. ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇక ఒక గిన్నెలో పూర్తిగా నానబెట్టి పైన ప్లాస్టిక్ కవర్ తో కవర్ చేయాలి . కేవలం రాత్రిపూట మాత్రమే ఈ మిశ్రమాన్ని నానబెట్టాలి. ఉదయాన్నే మీ జుట్టుకు అప్లై చేసి అరగంట ఆగిన తర్వాత తలస్నానం చేయాలి. ఇలా నెలకు రెండు లేదా మూడు సార్లు మీ జుట్టుకు ఈ ప్యాక్ వేస్తే చక్కటి ఫలితాలు లభిస్తాయి.