SmartPhones : ప్రపంచంలోనే అత్యధిక బ్యాటరీ కలిగిన స్మార్ట్ మొబైల్ ఇదే.. ఫీచర్స్ అదుర్స్.. !!

SmartPhones : ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీతో కలిగిన ఒక స్మార్ట్ మొబైల్ విడుదలయ్యింది.. OUKITEL అనే చైనా స్మార్ట్ మొబైల్ విడుదలయ్యింది. ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే..21,000 MAH బ్యాటరీతో ఈ మొబైల్ లాంచ్ చేయడం జరిగింది. ఈ మొబైల్ ప్రపంచవ్యాప్తంగా సరికొత్తగా పరిచయం చేసింది. ఇక 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుందట. ఈ మొబైల్ 6.79 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే తో కలదు. ఇక అంతే కాకుండా హిలియో ZEE -95 ప్రాసెస్ కలదు . 8 జిబి ర్యామ్ తో పాటు..256 GB స్టోరేజ్ మెమొరీ కలదు. ఇక ఈ ఫోన్ ఇతర ఫీచర్ల స్పెసిఫికేసన్ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

OUKITEL WP-19 : ఆలీ ఎక్స్ప్రెస్ లో ప్రీమియం సేల్ సందర్భంగా ఈ మొబైల్ భారీ తగ్గింపుతో లభిస్తోంది.. ఈ మొబైల్ చైనాలో $259.99 అంటే దాదాపుగా మన ఇండియా కాస్ట్ ప్రకారం రూ.20,743 రూపాయలకే మనం కొనుగోలు చేసుకోవచ్చు . ఈనెల 26 వరకు మాత్రమే ఈ ఆఫర్ కొనసాగనుంది.

This is the smartphone with the highest battery in the world
This is the smartphone with the highest battery in the world

OUKITEL FEATURES : ఈ మొబైల్ ఫీచర్ విషయానికి వస్తే ..6.79 అంగుళాల హెచ్డి డిస్ప్లే తో కలదు. మీడియా టెక్ Helio G -95 ప్రాసెస్ 8జిబి RAM,256 GB మెమొరీ స్టోరేజ్ కలదు. ఇక ఈ మొబైల్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కోసం IP 68 అండ్ IP69K &MIL -STD -810H రేటింగ్ పొందింది.. అందువల్ల ఈ మొబైల్ అత్యంత బలంగా మరియు చాలా మన్నికంగా వచ్చే విధంగా తయారు చేశారు. దీంతోపాటు మొబైల్ లో సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటివి కూడా అమర్చారు.

CAMERA : మొబైల్లో త్రిబుల్ కెమెరా సెటప్ కూడా కలదు.. సాంసంగ్ -64 ఎంపీ ప్రైమరీ కెమెరా రెండవది 20 MP కెమెరా నైట్ విజయం సోని సెన్సార్ తో కలదు. ఇక ఈ మొబైల్ కెమెరా మనం సోనీ లైట్ ఇంకా చీకట్లో కూడా హై క్వాలిటీ ఫోటోలను మనం తీసుకోవచ్చు అలాగే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫి ని కూడా పొందవచ్చు.. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే..16 మెగాఫిక్ సెల్ కెమెరా కలదు. ఇక ఈ మొబైల్ 0 నుంచి 80 శాతం వరకు ఫోన్ చార్జ్ అవ్వడానికి మూడు గంటల సమయం పడుతుందని కంపెనీ తెలియజేసింది.. మొబైల్ రివర్స్ చార్జింగ్ సపోర్ట్ కూడా కలదు. ఈ మొబైల్ బ్యాటరీ అత్యధికంగా 21,000 MAH బ్యాటరీ సామర్థ్యం కలదు.