BEAUTY Tips : చిన్నపిల్లలు.. ముఖ్యంగా స్కూల్ కి వెళ్లే పిల్లల తలలో ఎక్కువగా ఈ పేలు అనేవి కనిపిస్తూ ఉంటాయి.. వీటి వల్ల పిల్లల ఏకాగ్రత మొత్తం చెడిపోయి.. ఇక వారి దృష్టి మొత్తం ఈ పేల పైనే ఉంటుంది. ఇక ఈ పేలు తలలో ఉండడం వల్ల అతిగా దురద పెట్టడంతో పాటు చికాకును తెప్పిస్తూ.. పక్కవాళ్లకు చిరాకు గాను అనిపిస్తూ ఉంటాయి.. స్కూల్ కి వెళ్ళే పిల్లలకు ఈ పేలు ఒకరి నుంచి మరొకరికి సోకడంతో పాటు పిల్లల నుంచి వారి తల్లికి లేదా తండ్రికి కూడా పాకుతూ ఉంటాయి. ఇక వీటి వల్ల ఇంటిల్లిపాదీ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఈ పేలను దూరం చేసుకోవడానికి ఎంతో మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి మార్కెట్లో దొరికే విషపూరితమైన రసాయనాలు కలిగిన నూనెలు తీసుకొచ్చి జుట్టుపై అప్లై చేస్తూ ఉంటారు. వీటివల్ల జుట్టు దెబ్బతినడమే కాకుండా పిల్లల కంటి చూపు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ పేలను దూరం చేయాలి అంటే ఒక సరైన పద్ధతి ఉంది అదేమిటో ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం.ఇందుకోసం మీకు కావలసినవి ఐదు వెల్లుల్లి రెబ్బలు.. పొట్టు తీసి మెత్తగా పేస్టు లాగా తయారు చేయాలి.
ఒక బౌల్ లోకి వేసి అందులోకి పావు టేబుల్ స్పూను మిరియాల పొడి , అర టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. స్కాల్ఫ్ కు అప్లై చేసి ఒక గంట పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయడం మంచిది. జుట్టు తడిగా ఉన్నప్పుడే దువ్వెనతో దువ్వితే పేలు అన్ని వెంటనే కింద పడి పోతాయి. కాబట్టి వారానికి రెండు సార్లు ఇలా చేస్తే పేలు మొత్తం జుట్టు నుండి వెళ్లిపోతాయి.. మీ పిల్లలు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే వెంటనే ఈ చిట్కా పాటించండి.