Singer Sunitha : సూపర్ స్టార్ కృష్ణ మృతి ని తట్టుకోలేకపోయిన సింగర్ సునీత.వీరిద్దరి మధ్యన ఉన్న అనుబంధం ఇదే !

Singer Sunitha : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ పంచ పాండవులలో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు. అయితే ఈరోజు ఈయన మరణించడంతో లెజెండ్రీ యాక్టర్ల శకం ముగిసినట్టే అని తెలిసి ప్రతి ఒక్కరూ మరింత దిగ్భ్రాంతికి గురి అవుతున్నారు. ఈ నేపథ్యంలోని కృష్ణ పార్థివ దేహాన్ని సందర్శనార్థం ఇంటికి తరలించగా ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబుకు ఓదార్పు ఇస్తున్నారు.

Advertisement
This is the relationship between Krishna and singer Sunitha
This is the relationship between Krishna and singer Sunitha

మరి సూపర్ స్టార్ కృష్ణ మరణించారన్న వార్త తెలుసుకొని సింగర్ సునీత కన్నీటి పర్యంతం అవుతున్నారు. మరణ వార్త విని తట్టుకోలేకపోయినా సునీత బోరున కన్నీరుని పెట్టుకున్నట్లు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. నిజానికి సూపర్ స్టార్ కృష్ణ అంటే సింగర్ సునీతకు వీరాభిమానం.. సింగర్ సునీతను కృష్ణ గారు కూడా కూతురితో సమానంగా చూసుకునే వారట. ఈ కారణంగానే సునీత మరింతగా కన్నీటి పర్యంతమవుతుందని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. సునీత పాటలను అప్పుడప్పుడు మెచ్చుకునేవారట కృష్ణ. ఈ క్రమంలోనే ఆమె కృంగిపోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా సూపర్ స్టార్ కృష్ణ మరణించడం ప్రతి ఒక్కరికి బాధాకరమని చెప్పాలి.

Advertisement

బుర్రిపాలెం నుంచి వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ సుమారుగా 350 కి పైగా చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు తెలుగు సినీ పరిశ్రమకు ఈస్ట్ మన్ కలర్ ను పరిచయం చేసిన ఘనత కూడా ఈయనదే. అలాగే హాలీవుడ్ రేంజ్ లో సినిమాలను తెరకేక్కించడం.. మొదటిసారి కౌబాయ్గా మారిన సూపర్ స్టార్ కృష్ణ ను చూసి ఆంధ్ర ప్రజలు ఆంధ్ర జేమ్స్ బాండ్ అనే బిరుదు కూడా ఇచ్చారు. అంతేకాదు రాజకీయ రంగంలో కూడా చెరగని ముద్ర వేసుకున్నారు కృష్ణ. ఇక ఈయన సినీ రంగానికి చేసిన సేవలు గాను పద్మభూషణ్ అవార్డు కూడా లభించింది.

Advertisement