Business Idea : తక్కువ పెట్టుబడితో.. ఎక్కువ లాభాలు పొందాలంటే.. ఈ బిజినెస్ చేయాల్సిందే..!!

Business Idea : ఇటీవల కాలంలో చాలా మంది ఉద్యోగాలు చేయడానికంటే ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే అధిక లాభాలు వస్తాయి కదా అని ఆలోచిస్తూ ఉన్నారు. అయితే వ్యాపారం మొదలు పెట్టాలి అంటే లక్షల్లో కూడుకున్న పని .. కాబట్టి చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. ఇకపోతే వ్యాపారం చేయాలి అంటే సరైన మెళకువలు ఉండాలి.. ముఖ్యంగా మీరు ఎలాంటి వ్యాపారం చేయాలి అనుకుంటున్నారో దానికి సంబంధించిన పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మీరు మీ బిజినెస్ లో సక్సెస్ అవుతారు. అయితే ఒకటికి రెండుసార్లు ఎలాంటి వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారో దానివల్ల ఎంత ఖర్చవుతుంది.. ఎలాంటి లాభాలు పొందవచ్చు అని ప్రతి విషయాన్ని కూడా నిపుణులను తెలుసుకొని మరీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ వ్యాపారం గురించి మనకు సగం వరకే తెలిసి ఉన్నట్లయితే మరిన్ని నష్టాలను పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీరు చేసే ఏ వ్యాపారం అయిన సరే పబ్లిసిటీ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు తయారు చేసే వస్తువులు ఇతరులకు తెలిసి వారు కొనుగోలు చేయాలి అంటే పబ్లిసిటీ చేయాల్సి ఉంటుంది.

అంతేకాదు నాణ్యమైన వస్తువులను తయారు చేసినప్పుడు ఖచ్చితమైన దిగుబడి కూడా లభిస్తుంది. ఎవరైనా వ్యాపారం చేయాలనుకునేవారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బ్యాంకుల ద్వారా సబ్సిడీతో కూడిన లోన్ ని కూడా ఇస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పబోయే ఒక బిజినెస్ పెద్దగా డబ్బు లేకున్నా సరే లోన్ తీసుకునే వ్యాపారం చేయవచ్చు. మీరు సొంతంగా వ్యాపారం చేయాలని అనుకున్నట్లయితే.. అందుకు పౌల్ట్రీ ఫామ్ ఒక చక్కటి బిజినెస్ అని చెప్పవచ్చు. కేవలం దీనికి మీరు రోజుకు నాలుగు గంటల సమయం కేటాయిస్తే చాలు ఇతర పనులు కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పౌల్ట్రీ ఫామ్ పెద్దగా పట్టుకోవాలి అనుకుంటే కొంచెం పెట్టుబడి కాస్త ఎక్కువైనా బ్యాంకులు మాత్రం రుణాలు ఇస్తాయి. కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు 5 లక్షల రూపాయలు పెట్టుబడిగా పెడితే.. చిన్నగా షెడ్ గోడలు , ఐరన్ మెష్, ఇతర సామాగ్రి మొత్తం ఇందులోనే కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా ఊరికి దూరంగా పొలాలలో నిర్మించుకుంటే ఏ ఉపయోగం ఉండదు. రోడ్డు సౌకర్యం ఉన్న చోట మాత్రమే పౌల్ట్రీ షెడ్ నిర్మించాల్సి ఉంటుంది. వీలైతే మీకు ఇంటిదగ్గర పౌల్ట్రీ షెడ్ నిర్మించినా సరిపోతుంది. ఇక షెడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రస్తుతం పౌల్ట్రీ ఫామ్ లు వెన్ కాబ్, స్నేహ సుగుణ వంటి పౌల్ట్రీ కంపెనీలతో మీరు అగ్రిమెంట్ చేసుకుంటే నష్టం వాటిల్లదు.

This Business wants to make more profit with less investment
This Business wants to make more profit with less investment

ముఖ్యంగా సదరు కంపెనీ వారి మీకు బాయిలర్ కోడి పిల్లలు కూడా ఇస్తారు. రవాణా ఖర్చులు కూడా ఇస్తారు. ఆ తర్వాత వాటికి అవసరమైన రోగాల బారిన పడకుండా ఇంజెక్షన్ లను కూడా అప్లై చేయడం జరుగుతుంది. కేవలం మీరు వాటిని జాగ్రత్తగా వారికి అందించాల్సి ఉంటుంది. అంతే కాదు అలా పెంచినందుకు మీకు ఆయా కంపెనీ వాళ్ళు కమిషన్ కూడా ఇస్తారు. సైజును బట్టి కంపెనీ వాళ్లే మీ దగ్గరకు వచ్చి కమిషన్ ఇచ్చి వారి కోళ్లు తీసుకువెళ్తారు. ఒకవేళ మీరు పది వేల రూపాయల సామర్థ్యంతో పౌల్ట్రీ ఫామ్ పెట్టాలని అనుకుంటే 45 రోజులకు ఒక బ్యాచ్ పూర్తవుతుంది. ఒక్కొక్క కోడి సుమారుగా రెండు కేజీల బరువు వరకు పెరుగుతుంది. ఇక మీ షెడ్యూల్ లో మొత్తం కోళ్ల బరువు 20 వేల కేజీలు అయితే కంపెనీ వారు ఒక్కో కేజీకి మూడు రూపాయల చొప్పున కమీషన్ చెల్లిస్తే.. మొత్తం 20 వేల కేజీల కోళ్లకు మీరు 60 వేల రూపాయలను పొందవచ్చు. ఇక పదివేల రూపాయలు ఖర్చు పోయిన సుమారుగా 50 వేల రూపాయలు లాభం అయితే లభిస్తుంది . ఒక బ్యాచ్ కి అంటే 45 రోజులకు 50 వేల రూపాయలను సులభంగా మీరు సొంతం చేసుకోవచ్చు. నాటు కోళ్లు మీరే సొంతంగా పెట్టుకుంటే మీ ఆదాయం మరింత రెట్టింపవుతుంది.