Smart TV : స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని అందులోను 4కె రెజల్యూషన్ డిస్ప్లేను కలిగి ఉన్న స్మార్ట్ టీవీల కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీకోసం రూ.25 వేల లోపే ఒక స్మార్ట్ టీవీ ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. నిజానికి 4k టీవీలు 25 వేల పైనే ఉంటాయి. చాలా బ్రాండ్స్ 43 ఇంచుల 4k టీవీలు ఈ రేంజ్ కంటే ఎక్కువ ధరలోనే ఉండడం గమనాభం అయితే ఒక 4కే స్మార్ట్ టీవీ కేవలం 20,000 లోపు ధరలోనే అందుబాటులోకి రావడం చాలా ఆసక్తికరమైన విషయం అని చెప్పాలి. ఫ్లిప్కార్ట్ నుంచి మార్క్యూ బైక్ ఫ్లిప్కార్ట్ ఇన్నోవ్యూ 43 ఇంచెస్ అల్ట్రా హెచ్డీ 4k స్మార్ట్ టీవీ ప్రస్తుతం అమ్మకానికి వచ్చింది.
మరి ఈ స్మార్ట్ టీవీ యొక్క అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా 43 ఇంచులు కలిగిన ఈ స్మార్ట్ టీవీ ధర రూ.19,999.. కానీ 43% డిస్కౌంట్తో ప్రస్తుతం ఈ ధరకు ఈ కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్ అందిస్తోంది. అంతేకాదు ఎస్బిఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1500 అదనపు తగ్గింపు కూడా ఉంటుంది. మొత్తంగా ఈ స్మార్ట్ టీవీ మీకు రూ.18,499 కే సొంతం చేసుకోవచ్చు. 3849 X 2160 పిక్సెల్ రెజల్యూషన్ కలిగిన ఈ స్మార్ట్ టీవీ క్రోమా డిస్ప్లే ఇంజన్ ను కలిగి ఉంటుంది. ఇక ఈటీవీ హెచ్ డి ఆర్ 10 కంటెంట్ కు సపోర్ట్ చేస్తుంది.
ఆండ్రాయిడ్ టీవీ9 ఆపరేటింగ్ సిస్టంపై ఈ మార్క్యూ టీవీ రన్ అవుతుంది.1.5 GB ర్యామ్, 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. డాల్బీ ఆడియో సపోర్టును కలిగి ఉండే ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ, 4Hdmi, 3USB , 3.6 MM హెడ్ ఫోన్ జాక్, ఎథర్నెట్ పోర్టు కూడా ఈటీవీకి కలిగి ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ , యూట్యూబ్ తో పాటు మరెన్నో యాప్స్ ఈ టీవీలో ఇన్బుల్డ్ గా ఉంటాయి. అంతేకాదు గూగుల్ క్రోమ్ కాస్ట్, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ తో ఈ స్మార్ట్ టీవీ పనిచేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్లిప్కార్ట్ లో మరింత తక్కువ ధరకే ఈ స్మార్ట్ ఫోన్లు బ్యాంక్ ఆఫర్స్ ఉపయోగించి కొనుగోలు చేయవచ్చు.