Heroines: సినీ ఇండస్ట్రీ అంటేనే అందాల సోయగం.. హీరోయిన్స్ తమ అందాలను ఆరబోస్తే కానీ ప్రేక్షకులు చూపు తిప్పకుండా ఉంటారు.. ఇక సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక హీరోయిన్స్ అంతా హాట్ హాట్ ఫోటో షూట్ లతో ఇంటర్నెట్ ను హిట్టేకిస్తున్నారు.. వీళ్ళకి తోడు మేమేమైనా తక్కువ తిన్నామా అంటూ సినిమాలలో నటించే ఆంటీలు సైతం అందాల ఆరబోతకు హద్దులు చెరిపేస్తున్నారు..
కుర్ర బ్యూటీలకు ఏమాత్రం తీసిపోకుండా.. సినిమాలలో పిన్ని , అక్క, అత్తయ్య, అమ్మగా నటించిన వాళ్లు కూడా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా అందాలను ఎక్స్పోజ్ చేస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమాంటూ హాట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఆంటీలు కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంటున్నారు.
అంతేకాండోయ్ అదిరిపోయే స్టెప్స్ వేస్తూ.. జిమ్ లో వర్కుట్ చేస్తూ.. పార్టీలో ఎంజాయ్ చేస్తూ.. కూతురితో కులాసాగా కబుర్లు చెబుతూ వీడియోలు పోస్టులు చేస్తున్నారు..టాలీవుడ్ కి ఇటీవల పరిచయమైన యంగ్ బ్యూటీస్ శ్రీ లీల, కృతి శెట్టి ఏ విధంగా ఫోటోషూట్ చేస్తున్నారో.. 50 వయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు.. ఆంటీ హీరోయిన్లు అదే రేంజ్ లో గ్లామర్ షో చేస్తున్నారు.
దాంతో యంగ్ హీరోయిన్స్ కన్నా ఆంటీ అందాలకే ఓటు వేస్తున్నారు నెటిజన్స్.. ఇలా ఘాటు అందాల విందు కి మైమరచిపోయి రేపటి రోజున ఈ యంగ్ హీరోయిన్స్ ను సైడ్ చేసి ఆంటీలనే బాగున్నారు అంటూ హీరోయిన్ గా సినిమాలు తీసినా ఆశ్చర్యపోకర్లేదు అంటూ వీక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.