Phone Exchange : సాధారణంగా మనం ఉపయోగించే స్మార్ట్ ఫోన్ పాతబడినప్పుడు కొత్త ఫీచర్లతో కలిగిన స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించాలని ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు. ఇక ఈ క్రమంలోని పాత ఫోను అమ్మడం లేదా ఎక్స్చేంజ్ చేయడం లాంటివి చేస్తారు.. నిజానికి స్మార్ట్ ఫోన్లు కేవలం కాలింగ్ చేయడం కంటే మరెన్నో పనులకు ఉపయోగపడుతుంది.. వ్యక్తిగత సమాచారం చాలా వరకు ఫోన్లలోనే సేవ్ చేస్తూ ఉన్నాము. ఇక డేటా , గ్యాలరీ ఫోన్లోనే నిల్వ చేస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా మీరు స్మార్ట్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు లేదా మీ ఫోన్ అమ్మకానికి పెట్టినప్పుడు మీ ఫోన్ యొక్క డేటాను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ మీరు మీ పాత ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ విక్రయించాలని చూస్తున్నట్లయితే అనధికారిక యాక్సిస్ ను నివారించడానికి అలాగే మీ డేటాను కోల్పోకుండా ఉండడానికి మీ ఫోన్ నుండి ముఖ్యమైన సమాచారాన్ని తప్పనిసరిగా తీసివేయాలని మీరు గుర్తించుకోవాలి.
మీరు ఎలాంటి టిప్స్ పాటించాలి అనే విషయానికి వస్తే.. మీ స్మార్ట్ ఫోన్ విక్రయించడానికి సిద్ధమవుతున్నప్పుడు ముందుగా మీరు బ్యాకప్ చేయాలి.. అలా చేసేటప్పుడు ముఖ్యమైన డాక్యుమెంట్లు , ఫోటోలు , కాంటాక్ట్ లు అలాగే వాట్స్అప్ చాట్లను కూడా గమనించాలి. ఇక ఈ సమయంలో మీకు గూగుల్ చాలా సహాయపడుతుంది. ముందుగా https://contacts.google.com కి వెళ్లి మీ కాంటాక్ట్లను సేవ్ చేయడానికి మీకు జిమెయిల్ కి sync చేసుకోవాలి . ఇక గూగుల్ ఫొటోస్ ఉపయోగించి ఫోటోలను ఇందులో బ్యాకప్ చేయవచ్చు. అంతేకాదు మీ ఫోన్ కి లింక్ చేయబడిన అన్ని ఖాతాలను తీసివేయాలి. మీరు విక్రయిస్తున్న స్మార్ట్ ఫోన్ నుండి గూగుల్ ఖాతా, మైక్రోసాఫ్ట్, వాట్సప్ ఇలా ప్రతి సోషల్ మీడియా ప్రొఫైల్ తో సహా డిలీట్ చేయడం మంచిది.
అలాగే మైక్రో ఎస్డి కార్డ్, సిమ్ కార్డును కూడా తీసివేయాలి.. ఇక ఇన్స్టాల్ చేసి వదిలేసి మీ ఫోన్లో ఫ్యాక్టరీ రీసెట్ చేయడం వల్ల కార్డులోని మొత్తం డేటా కూడా చెరిపి వేయబడుతుంది. ముఖ్యంగా బ్యాకప్ చేసి మీ డేటాను సురక్షితంగా బదిలీ చేసిన తర్వాత మీ స్మార్ట్ ఫోన్లో ఫ్యాక్టరీ డేటా రీసెట్ చేయండి. ఇది తప్పనిసరిగా మీ ఫోన్ యొక్క ర్యామ్ అలాగే స్టోరేజ్ ను క్లీన్ చేస్తుంది. ఇక ఫోన్ రీసెట్ చేసిన తర్వాత వెంటనే స్విచ్ ఆఫ్ చేయండి. అకౌంట్ లాగిన్ చేయకుండా ఫోన్ వాడితే ఏం కాదని అనుకోకూడదు. వైఫై కి కనెక్ట్ చేసి అసలు ఉపయోగించకూడదు. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ వ్యక్తిగత సమాచారం చోరీ అయ్యే అవకాశం ఉండదు.