సాధారణంగా అబ్బాయిలు షేవింగ్ చేసేటప్పుడు రేజర్ ను ఉపయోగిస్తారు. రేజర్ ఉపయోగించడం వల్ల ముఖం రఫ్ గా మారడమే కాకుండా ముఖం పై గీతలు, గాయాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు షేవింగ్ చేసుకోడానికి కంటే ముందు ముఖానికి కొద్దిగా ఆయిల్ ను అప్లై చేసి కొద్దిసేపు ఆగిన తర్వాత గడ్డం పై ఉండే వెంట్రుకలను రేజర్ సహాయంతో తీసివేయడం వల్ల చర్మానికి ఎటువంటి హాని జరగదు. పైగా వెంట్రుకలు కూడా సులభంగా తొలగిపోతాయి. ఇంకా క్లీన్ షేవ్ చేసుకునే వారు కూడా ఇలాంటి చిట్కా పాటించడం వలన చర్మం పై ఎలాంటి గీతలు , గాయాలు అనేవి కనిపించవు.
ఫేషియల్ ఆయిల్స్ ను ఉపయోగించడం వల్ల షేవింగ్ కి ఎక్కువ సమయం పడుతుందని అందరూ భావిస్తారు.. కానీ అది అపోహ మాత్రమే .. ఇలా ఫేషియల్ ఆయిల్స్ ను ఉపయోగించడం వల్ల ముఖం పై ఉన్న వెంట్రుకలు చాలా సులభంగా.. త్వరగా సున్నితంగా వదిలిపోతాయి. షేవింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు కచ్చితంగా ఎసెన్షియల్ ఆయిల్ ఉపయోగించడం వల్ల ఫలితం అయితే లభిస్తుంది. ఇక అంతే కాదు ఈ ఫేషియల్ ఆయిల్ లో మనకు విటమిన్ లు అలాగే పోషకాలు కూడా ఉంటాయి. ఇక అంతే కాదు షేవింగ్ తర్వాత ప్రీ షేవింగ్ ఆయిల్స్ ను కూడా మీరు ఉపయోగించవచ్చు.
గడ్డం యొక్క చర్మం తాజా గా ఉండడంతో పాటు మృదువుగా కూడా తయారవుతుంది. ఫేషియల్ రాషేష్ వల్ల ముఖంపై వచ్చే చిన్నపాటి పొక్కులు, మొటిమలు వంటి వాటిని కూడా దూరం చేసుకోవచ్చు. అంతేకాదు పూర్తిగా షేవింగ్ చేసిన తర్వాత మీకు మీ ఇంటి పెరటిలో లభ్యమయ్యే అలోవెరా జ్యూస్ ని కూడా అప్లై చేయవచ్చు. దీని వల్ల ముఖం చాలా అందంగా తయారవుతుంది. ఇకపోతే షేవింగ్ చేసుకున్న ప్రతిసారీ కూడా బ్లేడు మార్చకుండా దానిని వేడి నీళ్లలో మరిగించి ఉపయోగించవచ్చు. డిస్పోజల్ చేసేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది..