షుగర్‌తో బాధపడుతున్న గర్భవతులకు ఈ ఫుడ్స్ చాలా డేంజర్.. అవేంటంటే…

గర్భం ధరించిన తర్వాత తల్లులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది స్త్రీలకు గర్భధారణ సమయంలో షుగర్ వస్తుంటుంది. ప్రస్తుత కాలంలో ఇది ప్రధాన సమస్యగా మారింది. దీన్నే జెస్టేషనల్ డయాబెటిస్ అని కూడా అంటారు. ప్రెగ్నెన్సీ సమయంలో హార్మోన్లలో మార్పులు జరగడం, జన్యుపరమైన సమస్యలు, అధిక బరువు, శరీర తత్వాన్ని బట్టి ప్రెగ్నెన్సీ సమయంలో షుగర్ వస్తుంటుంది. అయితే ఈ సమస్య ఆరు నెలల తర్వాత బయటపడే అవకాశం ఉంది. జెస్టేషనల్ డయాబెటిస్ కారణంగా గర్భవతులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Advertisement

Advertisement

ప్రెగ్నెన్సీలో డయాబెటిస్ కారణంగా ఉమ్మనీరు పెరగటం, బిడ్డ బరువు కూడా అధికంగా పెరగడం, నెలలు నిండకముందే డెలివరీ అవ్వటం లాంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. అంతేకాకుండా షుగర్ లెవెల్స్ మరీ అధికంగా ఉంటే కడుపులోనే బిడ్డ చనిపోవడం లాంటి సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. డయాబెటిస్ బారిన పడిన గర్భవతులు ఆహారం తీసుకునే విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వారు ఎక్కువగా ఫైబర్ రిచ్ ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.

ఫైబర్ రిచ్ ఆహారం అంటే తృణధాన్యాలు, చిక్కుళ్లు, పండ్లు, కూరగాయలు. వీటిలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల బ్లడ్‌లో చక్కెర స్థాయి కంట్రోల్లో ఉంటుంది. అలానే ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల చాలాసేపు ఆకలి అవ్వకుండా కూడా ఉంటుంది. లీన్ ప్రోటీన్ రక్తంలో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఆ లీన్ ప్రోటీన్ అనేది చిక్కుడు, టోపు, చికెన్ లాంటి ఆహార పదార్థాలలో ఎక్కువగా ఉంటుంది. అలానే ప్రెగ్నెన్సీ టైమ్‌లో అవకాడో, డ్రై ఫ్రూట్స్, నట్స్, అలీవ్ నుండే తీసుకోవడం చాలా మంచింది. అలానే బ్రొకోలీ, బచ్చల కూర, కాలీఫ్లవర్, క్యాప్సికమ్‌లో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి. అవి గర్భిణీల డైట్ లో యాడ్ చేసుకుంటే మంచిది.

ఇక గర్భిణులు ఉప్పు తక్కువగా తీసుకోవడం చాలా మంచిది. ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ కి దూరంగా ఉండాలి. బాగా వేయించిన ఆహార పదార్థాలు, మాంసం, కొవ్వు పదార్థాలు లాంటివి వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది.

Advertisement