Electric Scooters : ఇండియన్ మార్కెట్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ ల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక మన దేశంలో అనేక కొత్త మోడల్స్ నిత్యం మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. ఇక వాటిలో కొన్ని మాత్రమే అత్యధికంగా అమ్ముడు అవుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా కస్టమర్లు బ్రాండ్ ఇమేజ్ ,సరసమైన ధర, అధిక రేంజ్, అలాగే విశ్వసనీయతను బట్టి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక గత నెలలో మన ఇండియాలో పెట్రోల్ ద్విచక్ర వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కూడా ఎక్కువగా సేల్ అయ్యాయి. ఇక జూలై 2022లో అత్యధికంగా అమ్ముడైన టాప్ ఫైవ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ల గురించి ఇప్పుడు చూద్దాం.
ఒకినావా ప్రైస్ ప్రో : గడిచిన జూలై నెలలో 10,041 యూనిట్ల ప్రైస్ బ్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది ఒకినావా. ఇందులో వుండే లిథియం అయాన్ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 8 గంటల సమయం పడుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 170 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ను ఇస్తుంది. కీలెస్ ఎంట్రీ, సైడ్ స్టాండ్ సెన్సార్లు, యాంటీ థెఫ్ట్ అలారం, పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, లో బ్యాటరీ ఇండికేటర్ మరియు పాస్ లైట్ వంటి ఫీచర్లు కూడా ఈ స్కూటర్లో అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్ ధర రూ. 87,593 ఎక్స్ షోరూం విలువ. టీవీఎస్ ఐక్యూబ్ : గడిచిన జూలై నెలలో 6304 యూనిట్ల టీవీఎస్ ఐ క్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు విక్రయించబడ్డాయి. ప్రస్తుతం ఇది మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఐ క్యూబ్ ఎస్ వేరియంట్ ధర రూ.1,21 లక్షలు.3.4 kwh బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది . ఒకసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తాయి. గరిష్టంగా 140 కి.మీ రియల్ టైం రేంజ్ ను అందిస్తుంది.
బజాజ్ చేతక్ : ఈ స్కూటర్ జూలై నెలలో 3,022 యూనిట్లు అమ్ముడుపోయాయి. 3Kwh సామర్థం కలిగిన ఐపి67 రేటెడ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇక గరిష్టంగా 95 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ ను అందిస్తుంది. ఇక ఒక్కసారి ఛార్జ్ అవ్వడానికి ఐదు గంటల సమయం పడుతుంది. ఇక ఈ స్కూటర్ ధర రూ.1,34,814 ఎక్స్ షోరూం విలువగా నిర్ణయించబడింది. ఏథర్ 450 X : గత జూలై నెలలో 2,714 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లు విక్రయించబడ్డాయి.3.7 Kwh బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుంది. ఒకసారి పూర్తి చార్జ్ చేస్తే 146 కిలోమీటర్ల రేంజ్ను అందుకుంటుంది. ఇక ఈ స్కూటర్ ధర రూ.1.39 లక్షలు.