కొడుకు ఉన్నతి కోసం తల్లిదండ్రులు చేయవలసిన పూజలు ఇవే!

భారతీయ సనాతన సంప్రదాయాలలో వివాహానికి చాలా పెద్దపీట వేశారు మన పూర్వీకులు. అందుకే నేటి సమాజం ఎన్ని పాశ్చాత్య పోకడలకు పోతున్నా భారతీయ సనాతన ధర్మాన్ని ఆచరించిన మన ఏకపత్నీవ్రతులుగానే ఉంటాం. ఇలాంటి సంస్కృతీ సంప్రదాయం మారే దేశంలోనూ మనకి మచ్చుకైనా కనబడదు. ఇక వివాహం అనంతరం ఇక్కడ తల్లిదండ్రులు తమ పిల్లల్ని మంచి సామాజిక స్పృహ, క్రమశిక్షణతో పెంచుతారు. అయితే ఈ పరిస్థితులు కాస్త మసకబారుతున్న పరిస్థితి ఇక్కడ దాపురించింది.

నేటి దైనందిత జీవితంలో సగటు మనిషి వృత్తి పరంగా చాలా వత్తుళ్ళకు లోనవుతున్నాడు. భర్తతో పాటు భార్య కూడా ఇపుడు బయటకు వెళ్లి పని చేయవలసిన పరిస్థితి వచ్చింది. రోజురోజుకీ పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు, పిల్లల స్కూలు ఫీజులు కావచ్చు… సగటు మధ్యతరగతి వాడికి సంసారం అంటేనే పెద్ద గుదిబండగా మారిన పరిస్థితి. అందుకే ఇక్కడ చాలామంది తమ పిల్లలకు సరియైన సమయాన్ని కేటాయించలేక, అటు సోషల్ లైఫ్ అనుభవించలేక నిత్యం ఆర్ధిక సమస్యలతో సతమతం అవుతూ వున్నారు.

దాంతో రేపటితరం భవిష్యత్తు ప్రశ్నర్ధకంగా మారుతోంది. మరీ ముఖ్యంగా అబ్బాయిల జీవితాలు ఒక వయస్సు వచ్చాక అయోమయంలో పడిపోతున్నాయి. దాంతో వారు ఎటూ చెందక జీవితాన్ని కోల్పోయిన పరిస్థితి వస్తోంది. వాస్తవం చెప్పాలంటే వివాహాల విషయంలో ఇపుడు అబ్బాయిలు చాలా వెనకబడిపోతున్నారు. అమ్మాయిలకు తహతకు తగ్గట్టు వరుణ్ణి ఇచ్చి వివాహం జరిపించిన తల్లిదండ్రులు కన్న కొడుకు విషయంలో మాత్రం తప్పటడుగులు వేస్తున్న పరిస్థితి. ఆర్ధికంగా ఇక్కడ సరిగ్గా సెటిలవ్వని వారికి పిల్లలు దొరకని పరిస్థితి వుంది.

అందుకే కొడుకు ఉన్నతికోసం తల్లిదండ్రులు చేయవలసిన కార్యాల గురించి మన సనాతన ధర్మ శాస్త్రాలలో కొన్ని పూజలు చేయమని చెప్పడం జరిగింది. తల్లిదండ్రులు ఉదయాన్నే క్రమం తప్పకుండా గణపతి పూజలు చేస్తే మంచి ఫలితం ఉంటుందని శాస్త్రం. మరీ ముఖ్యంగా బుధవారంనాడు గణపతి పూజ, మంగళవారంనాడు ఆంజనేయుని సేవించాలి. ఇక శుభకార్యాలప్పుడు బంధు మిత్రులకు రామాయణాన్ని దానంగా ఇవ్వాలని ప్రతీతి.