Best Tablet : ఇండియన్ మార్కెట్లో బెస్ట్ టాబ్లెట్ మోడల్స్ ఇవే..!!

Best Tablet : ఇటీవల కాలంలో చాలామంది పిల్లలు , పెద్దవాళ్లు ప్రతి ఒక్కరు కూడా సంగీతం వినడానికి చదవడానికి మరే ఇతర పనులకు ఎక్కువగా టాబ్లెట్ పీస్ లను ఉపయోగిస్తున్నారు. మరీ ముఖ్యంగా భారత మార్కెట్లో స్మార్ట్ ఫోన్లు లాప్టాప్ల కంటే టాబ్లెట్ మోడల్ బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి .భారీ గజిబిజిగా ఉండే లాప్టాప్ మోడల్ లకు బదులుగా కొత్త టాబ్లెట్ మోడల్ లను ఉపయోగించడం వినియోగదారులు ప్రారంభించారు. ఇక ఈ నేపథ్యంలోని ఇండియన్ మార్కెట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న ఉత్తమ ట్యాబ్లెట్ మోడల్ ల గురించీ తెలుసుకుందాం వీటి వల్ల కచ్చితంగా విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు.

నోకియా టి 20 ట్యాబ్ : ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన ఈ ట్యాబ్ నాణ్యమైన ఫ్యూచర్లతో లభిస్తుంది. ముఖ్యంగా అమెజాన్లో దీని ధర రూ.17,970 ధరతో మీరు సొంతం చేసుకోవచ్చు. ఇక ఇతర ఫీచర్ల విషయానికి వస్తే 10.4 అంగుళాల 2 కే ఎల్ సి డి డిస్ప్లే డిజైన్తో..2000*1200 పిక్సెల్స్ 400 మినిట్స్ బ్రైట్నెస్ , యూనిసాక్ డి610 ప్రాసెసర్ తో పాటు ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంతో ఈ ట్యాబ్ పనిచేస్తుంది. ముఖ్యంగా పవర్ ఆమ్ప్లిఫైర్ తో పాటు డ్యూయల్ మైక్రోఫోన్ అలాగే స్టీరియో స్పీకర్లతో సహా పలు ప్రత్యేకమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 800ఎంహెచ్ బ్యాటరీతో 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 8 ఎంపీ బ్యాక్ కెమెరా 5mp సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది.

These are the best tablet models in the Indian market
These are the best tablet models in the Indian market

సాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ s6 లైట్ : 4 GB ర్యామ్ అలాగే 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో 10.4 అంగుళాల WUXGA TFT డిస్ప్లే డిజైను కలిగి ఉంటుంది . ముఖ్యంగా 2000 x 1200 మెగా పిక్సెల్ తో లభించే ఈ ట్యాబ్ అమెజాన్ లో రూ 24,999 కి లభిస్తుంది. 8MP బ్యాక్ కెమెరా..5 MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే 7040 ఎంహెచ్ బ్యాటరీతో లభిస్తుంది. ఇక అంతేకాదు వైఫై , బ్లూటూత్ 5.0, జిపిఎస్ సపోర్ట్ తో పాటు 3.5 mm ఆడియో జాక్ కనెక్టివిటీ ఫీచర్లను కూడా కలిగి ఉంది.

లెనోవో ట్యాబ్ P11 : 4GB ర్యామ్ అలాగే 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో అమెజాన్ లో రూ.21,999 కే లభిస్తుంది. ఆపరేటింగ్ సిస్టంతో స్మార్ట్ క్వాడ్ స్టీరియో స్పీకర్స్ తో పాటు డాల్బీ అట్మాస్ వంటి మరెన్నో ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. 13 ఎంపీ బ్యాక్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పాటు 7500 ఎం ఏ హెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది.