Smart Phones : రూ.7000 లోపు లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే.. అద్భుతమైన ఫీచర్స్ తో..!

Smart Phones :  ప్రస్తుత కాలంలో చాలామంది తక్కువ బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ కొనాలని ఆలోచిస్తూ ఉంటారు . అంతేకాదు బడ్జెట్ తక్కువగా ఉండడంతో పాటు అదిరిపోయే ఫీచర్స్ కావాలని ఆలోచించేవారు సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఇక ఈ క్రమంలోని పలు టెక్ సంస్థలు తమ స్మార్ట్ ఫోన్లను అత్యధిక ఫీచర్స్ తో , తక్కువ ధరకే లాంఛ్ చేస్తున్నాయి . ఇక ఈ క్రమంలోని మీరు కూడా బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే మీకు ఒక సువర్ణ అవకాశం.. కేవలం రూ. 7000 లోపే లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం.

సాంసంగ్ గెలాక్సీ A03 కోర్ : ఈ స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల హెచ్డి రెజల్యూషన్ డిస్ప్లే తో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్లో మైక్రో ఎస్ డి కార్డు తో 1TB వరకు స్టోరేజ్ ను పెంచుకోవచ్చు. ఇక 2GB ర్యామ్, 32GB స్టోరేజ్ తో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే.. వెనుక 8 ఎంపీ సింగల్ కెమెరా అమర్చబడింది .ముందు భాగంలో సెల్ఫీ కోసం 5 మెగాపిక్సల్ కెమెరా అమర్చిబడి ఉంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ మీకు రూ. 7000 లోపే లభిస్తుంది.

These are the best smart phones under Rs.7000.. with amazing features
These are the best smart phones under Rs.7000.. with amazing features

Realme C30 : ఈ స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ హెచ్డి స్క్రీన్ తో పాటు 120 Hz రీఫ్రెష్ రేటుతో టచ్ షాంప్లింగ్ రేటును కలిగి ఉంటుంది. 2GB / 3GB ర్యామ్ +32 GB స్టోరేజ్ వేరియంట్ తో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. వెనుక భాగంలో 8MP సింగిల్ కెమెరా తో , 5MP సెల్ఫీ కెమెరా అమర్చబడింది.10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 mah బ్యాటరీని కలిగి ఉంటుంది.

రెడ్ మీ 9A : ఈ స్మార్ట్ ఫోన్ 6.53 అంగుళాల హెచ్డి ప్లస్ రెజల్యూషన్ డిస్ప్లేన్ కలిగి ఉంటుంది. 3GB ర్యామ్ + 32 GB స్టోరేజ్ వేరియంట్ ఆప్షన్లలో జత చేయబడుతుంది. 8 MP రియర్ కెమెరా తో పాటు 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ని కూడా అమర్చారు.10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 mah బ్యాటరీని కలిగి ఉంటుంది.