Investment Plans : మహిళలు కూడా ఒకరిపై ఆధారపడకుండా స్వయంశక్తితో సంతోషంగా జీవించాలని కోరుకుంటారు. ఇక అలాంటి వారు ఈ మధ్య కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థలో కూడా తమ వంతు కీలక పాత్ర పోషిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.. ఇక ఉద్యోగమైనా.. వ్యాపారమైనా.. రెండు చేతులా సంపాదిస్తూ.. కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడాలని ఆలోచిస్తున్నారు మహిళలు. అంతేకాదు భవిష్యత్తు తరాల కోసం నెలనెలా కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెడుతున్నారు కూడా.. అయితే వేటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి రాబడి వస్తుంది అనే విషయాలు చాలా మంది మహిళలకు అర్థం కావడం లేదు. ముఖ్యంగా ఆర్థిక విషయాలకు సంబంధించి కొన్ని విధానాలలో పెట్టుబడి పెడితే తప్పకుండా అధిక లాభం వస్తుంది అని అంటున్నారు ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు.

1. సూపర్ టాప్ అప్ హెల్త్ ఇన్సూరెన్స్ : ఇక ఇందులో ప్రతి మహిళ ఆరోగ్య భీమా కలిగి ఉండటం చాలా మంచిది. ఒకవేళ ఉద్యోగం చేస్తున్నట్లయితే యజమానికి అందిస్తున్న బీమా తో పాటు బయట కూడా ఆరోగ్య బీమా తీసుకోవడం చాలా ఉత్తమం. పెద్ద జబ్బుల చికిత్సకు అయ్యే ఖర్చు ను దృష్టిలో పెట్టుకొని సుమారుగా రూ.15 నుంచి రూ. 20 లక్షల ఆరోగ్య కవరేజి తీసుకోవడం తప్పనిసరి. మీరు ఈ సూపర్ టాప్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకం కింద లక్ష రూపాయలు చెల్లిస్తే చాలు మిగిలిన మొత్తాన్ని బీమా కంపెనీ ఇస్తుంది. సుమారుగా 10 లక్షల రూపాయల వరకు మనం ఉచితంగా బెనిఫిట్స్ పొందవచ్చు .
2. ఫ్లెక్సీ ఫిక్స్డ్ డిపాజిట్ : కష్టకాలం ఎదురైనప్పుడు బీమా నగదును ఎలా యాక్సిస్ చేసుకోవాలో చాలా మంది మహిళలకు తెలియదు అని చెప్పాలి. కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుంటే సొంతంగా కొంత డబ్బును పెట్టుబడి రూపంలో దాచుకోవడం చాలా అవసరం. సులభంగా యాక్సెస్ చేసుకోవడానికి వీలుగా ఉండే ఫ్లెక్సీ ఫిక్స్డ్ డిపాజిట్లు ఆరు నెలల ఖర్చులకు సరిపడా మీరు డిపాజిట్ చేయవచ్చు. అంతేకాదు మీరు డిపాజిట్ చేసిన మొత్తంలో 90 శాతం స్వల్పకాలిక రుణాలు కూడా పొందవచ్చు.
ఇక వీటితో పాటు నేషనల్ పెన్షన్ పథకం లో ఇన్వెస్ట్ చేయడం అలాగే ఫ్లెక్సీ క్యాప్, మిడ్ క్యాప్, ఇండెక్స్ ఫండ్స్ లో కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల మహిళలకు ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తవని చెప్పాలి.