Broadband Plans : ఇటీవల కాలంలో చాలా మంది వర్క్ ఫ్రం హోం పేరిట ఉద్యోగాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మీకు ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ సదుపాయానికి సంబంధించి ప్రాధాన్యత గురించి తెలిసే ఉంటుంది.. ఇక కొన్ని ప్రాంతాలలో ఆఫర్ ధరలలోని ఇంటర్నెట్ కనెక్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ వారికి ఇది చాలా ఖరీదైన విషయం గా పరిగణించబడుతోంది . అందుకే ప్రస్తుతం దేశంలో ఉన్న టెల్కోలు దేశవ్యాప్తంగా ఫైబర్ ఇంటర్నెట్ సేవలను విస్తరిస్తున్నాయి. అంతేకాకుండా అఫర్టబుల్ ధరల్లో ఎంట్రీ లెవెల్ ప్లాన్ లను కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇకపోతే ఈ క్రమంలోని జియో, వోడాఫోన్ ఐడియా , ఎయిర్టెల్ , బిఎస్ఎన్ఎల్ ఇలా అన్ని టెలికాం సంస్థలు కూడా కేవలం రూ.500 లోపు ఎంట్రీ లెవెల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లను అందిస్తూ ఉండడం గమనార్హం.ఇకపోతే ఇప్పుడు ఆయా కంపెనీలు అందిస్తున్న ఎంట్రీ లెవెల్ ప్లాన్లు అన్నింటినీ కూడా ఒకసారి చదివి తెలుసుకుందాం.
ఎయిర్టెల్ ఎంట్రీ లెవెల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ : దేశంలోనే టెలికాం దిగ్గజ సంస్థ అయినటువంటి భారతీయ ఎయిర్టెల్ కంపెనీ రూ.499 ధరలో ఎంట్రీ లెవెల్ బ్రాండ్ బ్యాండ్ ప్లాన్ అందించడానికి సిద్ధంగా ఉంది. అయితే ట్యాక్స్ అదనంగా వర్తిస్తాయి ముఖ్యంగా ఈ ప్లాన్ తో కంపెనీ 40MBPS ఇంటర్నెట్ వేగంతో 3.3 టీబీ డేటాను అందిస్తుంది. ఇక నెలరోజులపాటు వ్యాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు వినియోగదారులు కంపెనీ నుండి ఉచిత ఫిక్స్డ్ లైన్ వాయిస్ కాలింగ్ కనెక్షన్ కూడా పొందుతారు అయితే పరికరాల కోసం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
రిలయన్స్ జియో ఎంట్రీ లెవెల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ : భారతదేశంలోని అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో కంపెనీ రూ.399 ధరలో ఎంట్రీ లెవెల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ ను అందిస్తోంది. ఇక ఈ ప్లాన్ ద్వారా కంపెనీ మీకు 30 Mbps ఇంటర్నెట్ వేగంతో 3.3 TB డేటాను అందిస్తోంది. ఇక నెల రోజులు వ్యాలిడిటీ ఉంటుంది .అంతేకాకుండా వినియోగదారులు కంపెనీ నుండి ఉచిత ఫిక్స్డ్ లైన్ వాయిస్ కాలింగ్ కనెక్షన్ పొందవచ్చు.
బిఎస్ఎన్ఎల్ ఎంట్రీ లెవెల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ : భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ రూ.329 ధరలో ఎంట్రీ లెవెల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ ను అందిస్తోంది. ఇక ఈ ప్లాన్ ద్వారా యూసర్లు 20 ఎంబిపీఎస్ ఇంటర్నెట్ వేగంతో 1000 GB డేటాను పొందవచ్చు. ఇక ఇది నెలరోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది. అంతేకాకుండా ఈ ప్లాన్ తో పాటు ఉచిత ఫిక్స్డ్ లైన్ వాయిస్ కాలింగ్ కనెక్షన్ కూడా ఉంటుంది. అయితే వినియోగదారులు డివైస్ ల కోసం అదనంగా చెల్లించాలి.
వోడాఫోన్ ఐడియా ఎంట్రీ లెవెల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ : రూ.400 ధరలో మీకు ఈ ప్లాన్ లభిస్తుంది.40MBPS ఇంటర్నెట్ వేగంతో 3.5టీబీ డేటాను అందిస్తుంది. ఇక నెలరోజులపాటు వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ కంపెనీ సేవలు ఎంపిక చేయబడిన నగరాలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.