ప్రముఖ రిలయన్స్ జియో అధినేత ముఖేష్ అంబానీ దీపావళి కానుకగా మొదట 4 ప్రధాన నగరాలలో జియో ట్రూ 5G లాంచ్ చేస్తామని ప్రకటించారు. దీంతో మార్కెట్లో 5G స్మార్ట్ ఫోన్ ధరలు కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే 5G నెట్వర్క్ కు సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్ లను అందరూ ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. కాబట్టి వారి డిమాండ్ కూడా పెరగబోతుంది. అందుకే రూ.25,000 లోపు మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ 5G మొబైల్స్ ను మీ కోసం తీసుకురావడం జరిగింది. మరి ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
సాంసంగ్ గెలాక్సీ M53 5G:ఈ స్మార్ట్ ఫోన్ ధరలు విషయానికి వస్తే 6 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,499.. 8 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,499.. అయితే ఈ రెండు స్మార్ట్ ఫోన్లు అమెజాన్ లో బ్యాంక్ ఆఫర్స్ తో కేవలం రూ. 25,000 లోపే లభించడం గమనార్హం. ఇక కలర్స్ విషయానికి వస్తే.. డీప్ ఓషియన్ బ్లూ, మిస్టిక్ గ్రీన్ కలర్స్ లో అందుబాటులో ఉంది.120 Hz రిఫ్రెష్ రేటుతో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డి సూపర్ అమోలేట్ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే, మీడియా టెక్ డైమన్సిటీ 900 ప్రాసెసర్ తో వస్తుంది.25 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇక ప్రధాన కెమెరా 108 మెగాపిక్సల్, సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సల్ అందివ్వడం జరిగింది.
షావోమీ 11 లైట్ NE 5G :ఈ స్మార్ట్ ఫోన్ 6 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999.. 8 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999.. ఇక బ్యాంక్ ఆఫర్స్ తో కేవలం రూ.25,000 లోపే సొంతం చేసుకోవచ్చు. కలర్స్ విషానికి వస్తే.. జాజ్ బ్లూ, వినైల్ బ్లాక్, డైమండ్ డాజిల్ కలర్స్లో కొనుగోలు చేయవచ్చు. 90 Hz రిఫ్రెష్ రేటు తో 6.55 అంగుళాల ఫుల్ హెచ్డి సూపర్ అమోలేడ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778 G ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ప్రధాన కెమెరా 64 మెగాపిక్సల్, సెల్ఫీ కెమెరా 20 మెగాపిక్సల్ అందివ్వబడింది. 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 4250 ఎంఏహెచ్ బ్యాటరీ అందివ్వడం జరిగింది.