5G Smart Phones : టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కటి కూడా స్మార్ట్ గా ఉండాలని ఆలోచించే వినియోగదారుడు ప్రస్తుతం 5G వేగంతో డేటాను ఉపయోగించుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఈ క్రమంలోనే ప్రముఖ టెలికాం దిగ్గజం అయినటువంటి రిలయన్స్ జియో తాజాగా రూ.88,072 కోట్లు వెచ్చించి మరీ 5Gస్పెక్ట్రమ్ ను కొనుగోలు చేసింది. ఇక ఆగస్టు 15వ తేదీ నాటికి 5G నెట్వర్క్ ను మొత్తం 13 నగరాలలో అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని రిలయన్స్ జియో కొత్త బాస్ ఆకాష్ అంబానీ ఇన్ డైరెక్ట్ గా వెల్లడించిన విషయం తెలిసిందే. 5Gనెట్వర్క్ అందుబాటులోకి వచ్చినా ఆ నెట్వర్క్ సపోర్ట్ చేసే మొబైల్స్ కూడా మన దగ్గర ఉండాలి లేకపోతే 5G ని మనం ఉపయోగించుకోవడం కష్టం అవుతుంది. ఇకపోతే తక్కువ బడ్జెట్లో 5G స్మార్ట్ మొబైల్స్ కూడా మార్కెట్లో విడుదల అవుతున్నాయి.
OnePlus Nord CE 2 Lite 5G : 6GB ర్యామ్+ 128 GB స్టోరేజ్, 8GB ర్యామ్ +128GB స్టోరేజ్ వెరియంట్స్ లో ఈ స్మార్ట్ మొబైల్ ను లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా బేసిక్ మోడల్ రూ.18,999 కే లభిస్తుంది. అంతేకాదు ఇండిపెండెన్స్ సేల్ లో భాగంగా మీరు ఎస్బిఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా 1000 రూపాయలు తగ్గింపు కూడా ఉంటుంది. ఇక అంతేకాదు రూ.17,999 కే ఈ వన్ ప్లస్ 5G స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. ఇక 6.59 అంగుళాల ఫుల్ హెచ్డి ఎల్సిడి డిస్ప్లే తో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5Gప్రాసెసర్ తో పనిచేస్తుంది . కెమెరా విషయానికొస్తే 64 ఎంపీ, 2 ఎంపీ, 2 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సెట్ అప్ తో 16MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
Redmi Note 11pro Plus 5G : ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.20,899 కాగా.. అమెజాన్లో మీరు రూ.18,999 కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఎస్బిఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుగోలు చేసినట్లయితే 1000 రూపాయలు అదనపు తగ్గింపుతో రూ.17,999 కే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.6.67 అంగుళాల AMOLED డిస్ప్లే తో స్నాప్ డ్రాగన్ 695 5G ప్రాసెసర్ తో పనిచేస్తుంది.8GB ర్యామ్ +128GB స్టోరేజ్ వేరియంట్ తో 108MP +2MP +2MP రియర్ కెమెరాతో, 16MP ఫ్రంట్ కెమెరా లభిస్తుంది. ఇక వీటితోపాటు..POCO X4Pro 5G ధర రూ.18,499, Samsung galaxy M33 5G ధర రూ.17,999 లకే సొంతం చేసుకోవచ్చు.