SmartPhones : ఇండియన్ మార్కెట్లోకి 108 మెగా పిక్సెల్ క్వాలిటీ గల కెమెరా అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లు విడుదల చేయడం జరిగింది . మరి ఫోటోగ్రఫీ డే సందర్భంగా కొన్ని అద్భుతమైన స్మార్ట్ ఫోన్ ల గురించి మనం ఇప్పుడు చదివి తెలుసుకుందాం.. ఇన్ఫినిక్స్ నోట్ 12 ప్రో : ఈ మొబైల్ ప్రధాన కెమెరా 108 మెగా పిక్సెల్ క్వాలిటీతో f/1.75 అపర్చర్ తో వస్తున్న ప్రైమరీ కెమెరా ఈ మొబైల్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 6.7 అంగుళాల ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లే ప్యానెల్ ను అందిస్తున్నట్లు సమాచారం.. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేస్తుంది.33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000mah బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇక 8 GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ కెపాసిటీతో సమాచారం.
రియల్ మీ 9 : ఈ స్మార్ట్ ఫోన్ 108 మెగా పిక్సెల్ క్వాలిటీతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక మిగతా మూడు కెమెరాలు ఒకటి 8 మెగాపిక్సల్ మరొక రెండు.. 2 మెగాపిక్సల్ క్వాలిటీని కలిగి ఉన్నాయి. ఇక సెల్ఫీ కోసం 16 మెగా పిక్సెల్ కెమెరాను కూడా అందిస్తున్నారు. ఇక ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పనిచేస్తుంది 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. 6GB/8GB ర్యామ్ , 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంటుంది.
మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ : ఇక ఇందులో 108 మెగా పిక్సెల్ క్వాలిటీ కెమెరాతో పాటు రెండు కెమెరాలు లో ఒకటి 8 మెగాపిక్సల్ మరొకటి 2 మెగాపిక్సల్ క్వాలిటీని కలిగి ఉన్నాయి. సెల్ఫీ కోసం 32 మెగాపిక్సల్ కెమెరాను కూడా అందించారు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ని కలిగి ఉంటుంది. 6GB/8GB ర్యామ్ , 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ తో కూడిన స్మార్ట్ ఫోన్ లభిస్తుంది.
రెడ్మీ నోట్ 11S : ఇక ఈ స్మార్ట్ ఫోన్లో 108 మెగా పిక్సెల్ క్వాలిటీతో ప్రధాన కెమెరా అలాగే మరో రెండు 2 మెగాపిక్సల్ క్వాలిటీ కలిగిన కెమెరాలు అమర్చబడి ఉన్నాయి. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సల్ క్వాలిటీ కలిగిన కెమెరా అందిస్తున్నారు. అంతేకాదు ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ 5000 mah బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.