Jio : కొంచెం ధర ఎక్కువైనా సరే ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే ఏడాది పొడవునా ఇక మొబైల్ రీఛార్జి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని ఆలోచించే వారి కోసం జియో సరికొత్తగా ఏడాది పాటు వ్యాలిడిటీని అందించే అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మరి జియో అందిస్తున్న రీఛార్జ్ ప్లాన్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. జియో రూ.2,999 రీచార్జ్ ప్లాన్ : ఈ ప్లాన్ గడువు 365 రోజులపాటు లభిస్తుంది. డైలీ 2.5 GB డేటా ను 4జి హై స్పీడ్ వేగంతో పొందవచ్చు. ఇక అంతేకాదు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ అలాగే ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా పొందవచ్చు.
ఇక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఏడాది పాటు మొబైల్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు జియో కి సంబంధించిన అన్ని యాప్లను ఉచితంగా యాక్సిస్ చేసుకోవచ్చు. రూ.4,199 జియో రీఛార్జ్ ప్లాన్ : రిలయన్స్ జియో అందిస్తున్న అత్యంత ఖరీదైన ప్లాన్ ఇదే కావడం గమనార్హం . వ్యాలిడిటీ 365 రోజుల పాటు ఉంటుంది. ప్రతిరోజు 3GB డేటా తో పాటు అన్ని టెలికాం సర్వీస్ లకు ఉచితంగా అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ పొందవచ్చు . అలాగే ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను పొందే అవకాశం ఉంటుంది. ఇక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఏడాది పాటు ఉచితంగా సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. అంతేకాదు జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ వంటి అన్ని జియో యాప్ సేవలను ఉచితంగా పొందవచ్చు.
రూ.2,879 జియో రీఛార్జ్ ప్లాన్ : జియో అందిస్తున్న ఈ రీఛార్జ్ ప్లాన్ గడువు 365 రోజులు. ఇక ప్రతిరోజు 2GB డేటాను పొందవచ్చు. అలాగే 100 ఎస్ఎంఎస్లను డైలీ పొందే అవకాశం ఉంటుంది . ఇక ఏ నెట్వర్క్ కైనా సరే ఉచితంగా అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. అంతేకాదు అన్ని జియో యాప్ లకు సంబంధించి ఉచితంగా సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. రూ.2,545 జియో రీఛార్జ్ ప్లాన్ : ఈ ప్లాన్ మీకు 11 నెలలపాటు లభిస్తుంది.. అంటే 336 రోజులు మీరు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ పొందుతారు. అలాగే ప్రతిరోజు 1.5 జిబి డేటా తో పాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను పొందే అవకాశం ఉంటుంది . అంతేకాదు జియో యాప్ లన్నింటికీ కూడా సబ్స్క్రిప్షన్ పొందవచ్చు.