YS Viveka Case : వివేక హత్య కేసు విచారణ ఆలస్యంపై సీరియస్ అయిన సుప్రీంకోర్టు..!!

YS Viveka Case :  వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ ఉంది. 2019లో జరిగిన ఈ హత్య కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ చేపడుతూ ఉంది. ఈ హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర కూడా ఉన్నట్లు ప్రతిపక్షాలు ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో మరోపక్క సీబీఐ విచారణకీ అవినాష్ రెడ్డి కూడా రెండు మూడుసార్లు హాజరయ్యారు. రాజకీయంగా ఈ హత్య కేసు అనేక చర్చలకు దారితీసింది. దాదాపు రెండు సంవత్సరాలకు పైగా ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్న గాని… కొలిక్కి రాకపోవటంపై తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది.

Advertisement
The Supreme Court is serious about the delay in the trial of Viveka's murder case
The Supreme Court is serious about the delay in the trial of Viveka’s murder case

విషయంలోకి వెళ్తే ఇటీవల కేసు విచారణ ఆలస్యంపై నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయడం జరిగింది. ఇదే సమయంలో దర్యాప్తు అధికారి రామ్ సింగ్ నీ మార్చాలని కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ నీ విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు… కేసు విచారణ ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. పూర్తిగా దర్యాప్తు చేయకపోవడంపై కూడా మండిపడింది.

Advertisement

ఇందుకు సంబంధించి సిబిఐ పై ప్రశ్నల వర్షం కురిపిస్తూ అసలు కేసు విచారణ ఎక్కడిదాకా వచ్చింది అనేది సీల్డ్ కవర్ లో న్యాయస్థానానికి అందజేయాలని పేర్కొంది.ఇదే సమయంలో దర్యాప్తు అధికారి ఎందుకు పూర్తి చేయడం లేదని విచారణ త్వరగా ముగించకపోతే వేరే దర్యాప్తు అధికారిని ఎందుకు నియమించకూడదని కూడా… సిబిఐ లాయర్ ని ప్రశ్నించింది. దీంతో ఈ అంశంపై సిబిఐ డైరెక్టర్ దగ్గర వివరణ తీసుకుంటానని లాయర్ న్యాయస్థానానికి స్పష్టం చేశారు.

కింద వీడియో లో పూర్తి సమాచారం ఉంది చూడండి

Advertisement