Smart Glasses : స్మార్ట్ గ్లాసెస్.. 50 ఎంపీ కెమెరాతో.. ఫీచర్స్ తెలిస్తే షాక్..!!

Smart Glasses : అధునాతన టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సరికొత్తగా ఉండడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కష్టమర్లకు అనుకూలంగా ఉండే రకరకాల వస్తువులు ప్రస్తుతం మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మనిషి.. రోజురోజుకు సరికొత్త ఆవిష్కరణలు చేస్తూ తమ జీవన విధానాన్ని స్మార్ట్ గా మార్చుకుంటున్నాడు. ఇక ఈ క్రమంలోనే ప్రతిరోజు మార్కెట్లోకి రకరకాల గాడ్జెట్స్ అందుబాటులోకి వస్తున్నాయి.. ఇక ఎంతలా అంటే ఫోన్ తో చేసే పనులు కళ్లజోళ్ళతో కూడా చేయడం అనే అంతగా టెక్నాలజీ పెరిగిపోయింది . ఇక ఈ క్రమంలోని తాజాగా చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం అయినటువంటి షియోమి తొలిసారి షియోమి మిజియా పేరుతో స్మార్ట్ గ్లాసెస్ ను (కళ్ళ జోళ్ళు) భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది.

చైనీస్ కరెన్సీ ప్రకారం వీటి ధర 2,699 యుయాన్ లుగా ప్రకటించారు. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం వీటి ధర చూసుకున్నట్లయితే సుమారుగా రూ.31,500 అన్నమాట. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా.. ముఖ్యంగా చాలామంది దీని ధర చూసి ఒక కొత్త అధునాతన ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్ కూడా వస్తుంది కదా ఇందులో ఏముంది అంత గొప్ప అనే వారు కూడా లేకపోలేదు.. కానీ షియోమీ కంపెనీ మార్కెట్లోకి ఏది విడుదల చేసినా సరే సరికొత్తగా ఉంటూనే కస్టమర్లను ఆకర్షించడానికి ఏదో ఒక టెక్నాలజీని అందులో రూపొందించి ఉంటుంది అంటూ షియోమీ ప్రియులు చెప్పుకొస్తున్నారు. మరి ఇంత విలువ గలిగిన స్మార్ట్ గ్లాసెస్ లో ఎలాంటి ఫీచర్లు దాగి ఉన్నాయో మనం ఇప్పుడు ఒకసారి చదువు తెలుసుకుందాం.

The smart glasses feature a 50 MP camera
The smart glasses feature a 50 MP camera

షియోమి మిజియా స్మార్ట్ గ్లాసెస్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. ఈ గ్లాస్సెస్ ను సోనీ మైక్రో ఓఎల్ఈడి డిస్ప్లే తో నిర్మించడం జరిగింది. ఇక మరొక విశేషం ఏమిటంటే 50 ఎంపీ క్వాడ్ బేయర్ ఫోర్ ఇన్ వన్ వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు 8 ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలను కూడా అమర్చడం జరిగింది . అంతేకాదు వీటితోపాటు 5x ఆప్టికల్ జూమ్, 16x హైబ్రిడ్ జూమ్ కూడా చేయవచ్చు. ఇక ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికి వస్తే 3GB ర్యామ్ అలాగే 32GB ఇంటర్నల్ స్టోరేజ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఇక అంతేకాదు వైఫై , బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 10 W ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో 10,500 mah బ్యాటరీని కలిగి ఉంటుంది .అంతేకాదు వంద నిమిషాల నాన్ స్టాప్ వీడియో ని కూడా క్యాప్చర్ చేస్తుంది అని కంపెనీ స్పష్టం చేసింది.