Xiaomi Smart TV : షావోమీ.. ఎప్పటిలాగే అద్భుతమైన ఫీచర్స్ తో సరికొత్త స్మార్ట్ టీవీ ని అందుబాటులోకి తీసుకొచ్చింది.. అదే షావోమి స్మార్ట్ టీవీ X సీరీస్.. 1.207 బిలియన్స్ కలర్స్ ఎక్స్పీరియన్స్ తో కొత్త లైన్ అప్ డాల్బీ విజన్ తో ఈ స్మార్ట్ టీవీ లభిస్తుంది. అంతేకాదు కంటెంట్ క్రియేటర్ ఉద్దేశించిన విధంగానే అత్యంత రియలిస్టిక్ కలర్స్, కాంట్రాస్టును అందిస్తుంది.. రియాలిటీ ఫ్లో పిక్చర్ ఫ్రేమ్లను విశ్లేషిస్తుంది. వేగవంతమైన కంటెంట్ను చూసేటప్పుడు మృదువైన, బ్లర్ ఫ్రీ విజువల్స్ ఉండేలా ఫ్రేమ్లను ఇంటర్పోలేట్ చేశారు. ఈ స్మార్ట్ టీవీ 96.9% స్క్రీన్ టు బాడీ నిష్పత్తిలో ఫుల్ స్క్రీన్ అనుభవాన్ని అందిస్తుంది.
ముఖ్యంగా అద్భుతమైన మెకానిక్ ఫ్రేమ్ ను కలిగి ఉన్న ఈ కొత్త శ్రేణి స్మార్ట్ టీవీ మీకు మూడు విభిన్న పరిమాణాలలో అందుబాటులోకి రావడం గమనార్హం..మునుపెన్నడూ లేనంతగా ఇంటరాక్టివ్ సొల్యూషన్లను అందించడం పై దృష్టి సారించిన షావోమి.. స్మార్ట్ టీవీ ఎక్స్ సిరీస్ ప్యాచ్ వాల్ తాజా వెర్షన్ ని కూడా కలిగి ఉంది. ఇకపోతే నేరుగా మ్యూజిక్ ట్యాబ్ నుండి యూట్యూబ్, మ్యూజిక్ ప్లే జాబితాలను యాక్సిస్ చేయవచ్చు. అంతేకాదు భారతీయ కంటెంట్ ఫ్లాట్ ఫార్మ్స్ ను, 15 కంటే ఎక్కువ భాషల నుంచి స్మార్ట్ సిఫార్సులు, కంటెంట్ ను ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉంటుంది.
ఇక టీవీలో హోమ్ స్క్రీన్ పై ఐఎండిబి ఇంటిగ్రేషన్, 300కు పైగా లైవ్ చానల్స్, యూనివర్సల్ సెర్చ్, కిడ్స్ మోడ్ తో సహా ప్యాచ్ వాల్ లో అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ టీవీ 10 ప్లాట్ ఫామ్ పై నడుస్తుంది. 2GB ర్యామ్ + 8 GB స్టోరేజ్ ని కూడా అందిస్తుంది. అంతేకాదు డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ, త్రీ హెచ్ డి ఎం ఐ పోర్ట్, 2 యూఎస్బీ పోర్టులు కూడా కలిగి ఉన్నాయి. ఇక 43 ఇంచెస్ షావోమీ టీవీ X ధర రూ.28,999.. 50 ఇంచెస్ ధర రూ.34,999 అలాగే 55 ఇంచెస్ ధర రూ.39,999. ప్రస్తుతం ఈ స్మార్ట్ టీవీ Mi.com , ఎంఐ హోమ్స్ తో పాటు ఫ్లిప్కార్ట్ , రిటైల్ స్టోర్ లో కూడా అందుబాటులో ఉంటాయి.