Tecno Phone : ప్రముఖ టెక్ దిగ్గజం నుంచి వచ్చిన టెక్నో స్మార్ట్ ఫోన్స్ ఇండియన్ మార్కెట్లో భారీగా అమ్ముడుపోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ స్మార్ట్ ఫోన్లపై ఇప్పటివరకు ఒక్క నెగిటివ్ మార్కు కూడా రాకపోవడం.. బ్యాటరీ బ్యాకప్ కూడా బాగా ఇస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ స్మార్ట్ ఫోన్ లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉండే తల్లులకు ఈ స్మార్ట్ ఫోన్లు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్లను ఎలా వాడినా సరే హాంగ్ కాకపోవడమే కాకుండా మంచి బ్యాటరీ బ్యాకప్ ను కూడా అందిస్తున్నాయి.
ఇకపోతే టెక్నో నుంచి వచ్చిన మరొక సరికొత్త సీరీస్ ను త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇకపోతే ఈ సీరీస్ నుంచి విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్ యొక్క పూర్తి ఫీచర్స్ ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఇక టెక్నో స్పార్క్ 9T స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనున్నట్లు సమాచారం .ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ 6.6 అంగుళాల డిస్ప్లే తో పాటు ఫుల్ హెచ్డి అలాగే రిజల్యూషన్ , వాటర్ డ్రాప్ నాచ్ ను ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంటుంది. ఇకపోతే పవర్ బటన్ లో పొందుపరిచిన సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కూడా కలిగి ఉండడం గమనార్హం. ముఖ్యంగా కెమెరా మాడ్యూల్ కూడా చాలా ఆకర్షణగా నిలుస్తోంది.
50 ఎంపీ ప్రైమరీ సెన్సార్ తో కూడిన ట్రిపుల్ రియల్ కెమెరా సెట్ అప్ తో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తూ ఉండడం గమనార్హం. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే 4GB ర్యామ్ తో పాటు 3GB వర్చువల్ మెమొరీ తో కూడా జత చేయబడుతుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 18W ఫాస్ట్ చార్జింగ్ తో 5000 mah బ్యాటరీని కలిగి ఉంది. ఇకపోతే డార్క్ బ్లూ , అలాగే టర్కోయిస్ గ్రీన్ రంగులలో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది.ఇక ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా కేవలం రూ.10,000 లోపు మాత్రమే ఉంటుందని అంచనా..128 GB వరకు నిల్వతో స్టోరేజ్ నిల్వ చేయబడినట్లు సమాచారం. కస్టమర్ల నుంచి 5 స్టార్ రేటింగ్ ను ఈ స్మార్ట్ ఫోన్స్ పొందాయి. ఇకపోతే సెల్ఫీ కోసం 8 మెగా పిక్సెల్ కెమెరాను కూడా అందించారు.