LIC Policy : ఆడపిల్ల పెళ్లి అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని.. కట్నం తో పాటు అమ్మాయి కి కావాల్సిన బంగారు ఆభరణాలను , వస్త్రాలను ఇలా ప్రతి ఒక్కటి కూడా అత్యంత ఖరీదైనవే సమర్పించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు ఆడపిల్లల పెళ్లి కోసం ముందు నుంచి డబ్బు దాచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక అందులో భాగంగానే ఆడ పిల్లల పెళ్లిళ్ల కోసం డబ్బులు దాయాలి అనుకునే తల్లిదండ్రులకు ఎల్ఐసి సరికొత్త పాలసీ నీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక ఆ పాలసీ ఏమిటి.. అందులో ఎంత వరకు ఇన్వెస్ట్ చేయాలి .. ఎంత లాభం పొందవచ్చు అనే విషయాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
నిజానికి ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న ఈ సమయంలో పిల్లల చదువులు, ఖర్చులు అంటూ తమ తల్లిదండ్రులు ఎంతో దిగులు పడుతూ ఉంటారు.. అలాంటి వారి కోసమే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక పాలసీ ని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అండగా నిలుస్తోంది. అదే ఎల్ ఐ సి కన్యాదాన్ పాలసీ. పాలసీ లో తక్కువ మొత్తంలో డిపాజిట్ చేసినా చాలు అమ్మాయి పెళ్లి సమయానికి కొన్ని లక్షల రూపాయలు డబ్బులు పొందవచ్చు. క్రమం తప్పకుండా ఈ పాలసీలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కాల నిర్ణీత సమయం ముగిసే సరికి పెద్ద ఎత్తున డబ్బులు మీ చేతికి వస్తాయి.అయితే ఎల్ ఐ సి కన్యాదాన్ పాలసీ లో నెలకు 4,530 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేయడం

వలన మంచి రాబడి ఉంటుంది. అయితే 22 సంవత్సరాల పాటు ప్రతి నెల రూ.4,530 చెల్లించాలి.. 25 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మీ చేతికి రూ.31 లక్షలు వస్తాయి. ఇక ఇంత మొత్తంతో అమ్మాయి పెళ్లి చాలా ఘనంగా నిర్వహించవచ్చు. ఇది ఒక అమ్మాయి పెళ్లి కోసమే కాదు అమ్మాయి భవిష్యత్తుకు పునాదులు వేసే ఏ పని కైనా ఈ డబ్బు మీరు ఉపయోగించుకోవచ్చు. పాలసీలో చేరేముందు అమ్మాయి యొక్క ఆధార్ కార్డు.. ఇన్కమ్ ప్రూఫ్.. అడ్రస్ ప్రూఫ్ ..ఐడెంటిటీ కార్డు .. పాస్పోర్ట్ సైజు.. బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది.