Fastrack.. ప్రముఖ వాచ్ బ్రాండెడ్ అయినటువంటి ఈ కంపెనీ నుంచి కొనుగోలు చేసే ప్రతి వాచ్ కూడా చాలా స్మార్ట్ గా హైటెక్నాలజీతో పనిచేస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ క్రమంలోనే మొదటిసారి బ్లూటూత్ స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది ఫాస్ట్ట్రాక్.. ఫాస్ట్ట్రాక్ రిప్లెక్స్ ప్లే + పేరుతో ఈ కాలింగ్ స్మార్ట్ వాచ్ ను తీసుకొచ్చింది. ఇకపోతే ఇప్పటివరకు సాధారణ వాచ్ లను మాత్రమే లాంచ్ చేసిన ఫాస్ట్ ట్రాక్ గతంలో సాధారణ స్మార్ట్ వాచ్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది . అయితే ఇప్పుడు మొదటిసారి బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ తో రిలీజ్ చేయడం గమనార్హం. ఇక ఈ స్మార్ట్ వాచ్ డిజైన్ విషయానికి వస్తే సర్కులర్ షేప్ డిజైన్లు కలిగి ఉంటుంది..
అంతేకాదు AMOLED డిస్ప్లే తో అల్యూమినియం కేస్ తో ఈ స్మార్ట్ వాచ్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోందని చెప్పవచ్చు. ఇక ధర విషయానికి వస్తే..ఫాస్ట్ట్రాక్ రిప్లెక్స్ ప్లే + ధర రూ.6,995.. ఇక ఈ కామర్స్ సైట్ అయినటువంటి అమెజాన్లో మీరు కొనుగోలు చేస్తే వెయ్యి రూపాయలు అదనంగా తగ్గింపుతో కేవలం రూ.5,995 దొరకు అందుబాటులో ఉంది .అలాగే ఫాస్ట్ ట్రాక్ ఆన్లైన్ స్టోర్ లో కూడా మీరు కొనుగోలు చేయవచ్చు . ఇక కలర్స్ విషయానికి వస్తే పింక్ , ఆక్వా బ్లూ, బ్లాక్, బ్లూ వంటి కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది.
ముఖ్యంగా 1.3 అంచుల రౌండ్ షేప్ డయల్ తో AMOLED డిస్ప్లేను అందించారు. సిలికాన్ స్ట్రాప్స్ ను కలిగి ఉంటుంది. ఇందులో ఇన్ బుల్ట్ స్పీకర్, మైకు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బ్లూటూత్ ద్వారా స్మార్ట్ ఫోన్ కి కనెక్ట్ అయినప్పుడు ఒకవేళ కాల్స్ వస్తే నేరుగా వాచ్ నుంచి మీరు ఆన్సర్ చేయవచ్చు.. అంటే వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరికైనా సరే ఈ వాచ్ నుంచీ ఫోన్ కూడా చేయవచ్చు. ఇక హెల్త్ ఫీచర్స్ విషయానికి వస్తే హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ స్యాచురేషన్ ట్రాకర్, బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ వంటి హెల్త్ ఫీచర్లను కూడా అందించారు. అలాగే 25 కు పైగా స్పోర్ట్స్ మోడ్స్ కూడా ఉన్నాయి. అలాగే స్లీప్ మానిటర్ , ఉమెన్స్ హెల్త్ ట్రాకర్ తో పాటు ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏడు రోజులపాటు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది అని కంపెనీ తెలిపింది.