Yogi Adityanadh : ఆ కానిస్టేబుల్ మరణం నాడే యోగి ఆదిత్యనాథ్ మాఫియా పై యుద్ధం

Yogi Adityanadh ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు మాఫియా సామ్రాజ్యాలు గజగజలాడుతున్నాయి. ఒక కానిస్టేబుల్ మరణించిన సమయంలో.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కన్నీరు పెట్టుకుని అతని అంత్యక్రియలలో పాల్గొని ఆ టైంలోనే యూపీలో మాఫియా సామ్రాజ్యం లేకుండా చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో ఆ దిశగానే అడుగులు వేస్తూ ఏకంగా ఇప్పటికీ 180 మంది మాఫియా డాన్ లను ఎన్కౌంటర్లు చేయడం జరిగింది. ఈ పరిణామంతో 28 వేల మందికి పైగా రౌడీ షీటర్లు.. ఎవరికి వాళ్లు కోర్టులో లొంగిపోవటం మాత్రమే కాదు జైలుకు వెళ్లిపోయారు.

బయట ఉంటే తమ ప్రాణాలకు ముప్పు కలుగుతుందని.. ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని.. మాఫీయా నేపథ్యం కలిగిన వాళ్లు.. ఎవరికి వాళ్లు బెయిల్ పై ఉన్నా సరే కోర్టులో లొంగిపోయి.. జైలుకు వెళ్ళిపోతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గతంలో సమాజ్ వాదీ.., బీఎస్పీ ప్రభుత్వాలలో మాఫియా నేపథ్యం కలిగిన వాళ్లు రౌడీషీటర్లు పెచుమెరిపోయారు.

దీంతో అటువంటి నేరచరిత్ర కలిగిన వారు సమాజంలో ఉండటం మంచిది కాదని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కంకణం కట్టుకొని ఎన్కౌంటర్ కరెక్ట్ పద్ధతిని చాలామందిని టార్గెట్ చేసుకుని తుపాకీ కి పని చెప్పి… లేపేస్తూ ఉంది. ఈ క్రమంలో విమర్శలు వస్తున్నా గానీ చాలామంది పోలీస్ లు.. మాఫియా చేతులలో మరణించడంతో యోగి ప్రభుత్వం చేస్తున్నది కరెక్ట్ అనీ అంటున్నారు. గత శనివారం మీడియా ఎదురుగా పోలీసుల సమక్షంలో లైవ్ లో దేశంలోని అతిపెద్ద గ్యాంగ్ స్టార్ మాజీ ఎంపీ అతీక్ అహ్మద్..నీ అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ నీ అతికిరాతకంగా కాల్పులు జరపీ చంపటం తెలిసిందే. ఈ ఘటన తరువాత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. లక్నోలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఈ సమావేశం ఏర్పాటైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆర్ కే విశ్వకర్మ, అదనపు డీజీపీలు, లక్నో నగర పోలీస్ కమిషనర్ సహా పలువురు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ ఘటనాలను ఆధారం చేసుకుని సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతూ మత విద్వేషాలను రెచ్చగొట్టే రీతిలో వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వ వర్గాలు హెచ్చరించాయి.