Best Smart Phones : గత రెండు దశాబ్దాలుగా పోల్చుకుంటే మొబైల్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు.. నిజానికి ఏదైనా ఒక వస్తువు మన లైఫ్ లోకి వస్తుందంటే అది కేవలం వస్తువు గానే పరిగణిస్తారు. కానీ స్మార్ట్ ఫోన్ అనేది మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయింది. కేవలం ప్రాథమిక అవసరాల కోసం మాత్రమే కాదు డిజిటల్ యాప్ లు అలాగే స్మార్ట్ ఫీచర్లు దాని మెజారిటీ ప్రజల జీవితంలో అంతర్భాగంగా మార్చాయని చెప్పవచ్చు. ఇకపోతే చాలామంది స్మార్ట్ ఫోన్ల యొక్క ధరల కారణంగా వాటి వాడాలంటేనే భయపడుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే 10,000 రూపాయల కంటే తక్కువ ధరలో లభించే కొన్ని స్మార్ట్ ఫోన్ల గురించి మనం ఇక్కడ చదివి తెలుసుకుందాం. ఇక ఇండియన్ మార్కెట్లో ఇవి అందుబాటులో ఉండటమే కాకుండా వీటి స్మార్ట్ ఫీచర్లు కూడా కస్టమర్లను బాగా ఆకర్షిస్తున్నాయి..
Redmi 9Active : రూ.10,000 లోపు లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇది అని చెప్పవచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్లో 4GB ర్యామ్, 64 GB ఇన్బిల్ట్ స్టోరేజ్ తో లభిస్తుంది. మైక్రో ఎస్డి కార్డు ద్వారా స్టోరేజ్ ను విస్తరించవచ్చు . ఇకపోతే బడ్జెట్ ధరలో లభించే ఈ స్మార్ట్ ఫోన్ మీరు కొనుగోలు చేయాలనుకుంటే బ్యాంక్ ఆఫర్లతో కేవలం రూ. 8,999 కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ 2.3 GHs octa -Core Helio G35 ప్రాసెసర్ తో పనిచేస్తుంది.
Techno Spark 9T : ఈ స్మార్ట్ ఫోన్ 6.6 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లేను కలిగి ఉంటుంది. మీడియా టెక్ Helio G35 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 4GB ర్యామ్ అలాగే 64 GB ఇన్బిల్ట్ స్టోరేజ్ తో వస్తుంది. ఇక హ్యాండ్ సెట్ లో 50 మెగాపిక్సల్ రియర్ కెమెరా అమర్చబడి ఉంది. 5000 ఎంహెచ్ బ్యాటరీ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.9,299.
Realme Narzo 50i : 6.5 అంగుళాల స్క్రీన్ కలిగి ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ 5000 ఎంఎహెచ్ బ్యాటరీ ని కలిగి ఉంటుంది. 64 జిబి అంతర్నిర్మిత నిల్వను కలిగి ఉంటుంది. ఇక ఈ ఫోన్లో 8 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ 4GB ర్యామ్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.8,999.