5G Smart Phones : ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా 5G హవా కొనసాగుతున్న నేపథ్యంలో చాలామంది 5G స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే సాంసంగ్ మొదలుకొని వన్ ప్లస్ వరకు రూ. 25 వేల లోపు లభించే బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్ గురించి మనం ఇప్పుడు చదివి తెలుసుకుందాం.
One plus Nord CE 2 5G : ఈ స్మార్ట్ ఫోన్ మనకు రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఒకటి 6 జీబీ కాగా మరొకటి 8GB.. ఇందులో ఇంటర్నల్ స్టోరేజ్ 128జీబి వరకు అందుబాటులో ఉంటుంది. వైఫై 6 సపోర్టుతో మీడియాటెక్ డైమంన్సిటీ 900 ఆక్టా కోర్ ప్రాసెసర్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక అదే విధంగా 119 డిగ్రీల వైడ్ యాంగిల్ వ్యూ, 16 ఎంపీ సెల్ఫీ సూటర్తో 64 ఎంపీ ప్రైమరీ సెన్సార్ కూడా ఉంటుంది.
Redmi Note 11ప్రో 5G : ఈ స్మార్ట్ ఫోన్ మీకు మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. మిరాజ్ బ్లూ, ఫాంటమ్ వైట్, స్టెల్త్ బ్లాక్ వంటి కలర్ ఆప్షన్ లో లభిస్తుంది. ఇక హ్యాండ్ సెట్ క్వాల్ కం స్నాప్ డ్రాగన్ 695 5G చీప్ సెట్ తో 5000 ఎమ్ ఏ హెచ్ బ్యాటరీ బ్యాకప్ ను కలిగి ఉంటుంది. ఇక 15 నిమిషాల్లోనే ఫుల్ చార్జింగ్ అందజేస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.. 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ సెన్సార్ , 2 మెగాపిక్సల్ మైక్రో సెన్సార్, 108MP కెమెరాతో రియర్ కెమెరా సెటప్ కూడా అందిస్తోంది.
iQOO Z6 Pro 5G : ఈ స్మార్ట్ఫోన్ క్వాలిటీ స్నాప్ డ్రాగన్ 778 5G ప్రాసెసర్ తో పనిచేస్తుంది. హ్యాండ్ సెట్ లో మూడు ర్యామ్ మోడల్స్ ఉన్నాయి. 6GB, 8GB, 12GB స్టోరేజ్ వేరియంట్ లో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. ఇక హెచ్డిఆర్ టెన్ ప్లస్ డిస్ప్లే..1300 నిట్స్, 90 Hz రిఫ్రెష్ రేటు తో పనిచేస్తుంది. ఇక ఈ డివైస్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై ఫన్ టచ్ ఓఎస్ 12 పై రన్ అవుతుంది.
వీటితోపాటు మరెన్నో స్మార్ట్ ఫోన్లు మీకు కేవలం రూ. 25 లోపలే లభించడం గమనార్హం.