THAMALPAKU:తమలపాకు రసంలో ఈ గింజలను కలిపి తీసుకుంటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనలా..?

మన సంప్రదాయం ప్రకారం భోజనం తర్వాత ఆకు, వక్క నమలడం వల్ల అరుగుదల బాగుంటుందని నమ్ముతారు. కానీ చాలా మందికి తమలపాకు వ్యసనంలా తినడం అలవాటు ఉంటుంది. అలా తినడం వల్ల తమలపాకులోని ఆస్ట్రింజెంట్ ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. కానీ ఆయుర్వేద వైద్యం లో భాగంగా ఎన్నో రోగాలను నయం చేయడానికి ఔషదంగా పని చేస్తుంది. తమలపాకు,తులసి గింజలను కలిపి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

తులసి చెట్టు ప్రతి ఒక్కరి ఇంట్లోను ఉంటుంది. ఒక వేల చెట్టు లేకపోతే తులసి గింజలు ఆయుర్వేదం షాప్ లలో కూడా ఈజీగా దొరుకుతాయి. వాటిని తీసుకొని గ్లాసు నీటిలో అర స్పూన్ తులసి గింజలను వేసి 2,3 గంటల పాటు నానబెడితే ఆ గింజలు సబ్జా గింజలు లా ఉబ్బుతాయి. అలా నానిన గింజల్లోకి తమలపాకును తీసుకొని శుభ్రం చేసి అందులో నుండి రసం తీయాలి.ఈ మిశ్రమంను పరగడుపున వారంలో మూడు రోజులు తీసుకుంటే చాలా ప్రయోజనాలను కలుగుతాయి.

ఇలాంటి తరుచుగా తీసుకుంటే జీర్ణక్రియ సాఫీ గా జరిగేలా చేస్తుంది. ఈ మిశ్రమాన్ని బాగా నమలడం వల్ల లాలాజల గ్రంథిని చురుకుగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. లాలా జల గ్రంథి ఆహారాన్ని చిన్న ముక్కలుగా విడగొట్టడానికి సహాయపడి,తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి మలబద్ధకం, అజీర్ణం మరియు గ్యాస్, గ్యాస్ట్రిక్ అల్సర్ వంటి పొట్ట సమస్యల తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది.

తమలపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయం చేస్తాయి. మన శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా ఉంటే ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా మన శరీరాన్ని కాపాడుకోవచ్చు. ఈ సీజన్ లో వచ్చే జలుబు,ఫ్లూ,గొంతు నొప్పి మరియు కఫం వంటి వాటిని తగ్గిస్తుంది. అలాగే తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చిగుళ్ళ వాపును తగ్గిస్తాయి. కొంతమంది నోటి దుర్వాసన లేదా చిగుళ్ళ నుండి రక్తం రావడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. వాటిని తగ్గించటానికి ఈ తమలపాకు, తులసి గింజల మిశ్రమం చాలా తొందరగా ఉపశమనం కలిగిస్తుంది. శారీరక బలహీనత లేకుండా చేస్తుంది. తులసి గింజలు నోటి రిఫ్రిష్మెంట్ కలిగిస్తాయి. అంతే కాక రక్తం, రక్తనాలాల్లో బాగా సరఫరా జరిగేందుకు సహాయపడతాయి. దీని వల్ల బీపీ మరియి గుండె జబ్బులు రాకుండా సహాయపడతాయి. ఆస్తియోపొరోసిస్ రాకుండా క్యాల్షియం పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.