Telugu States in jobs : తెలుగు రాష్ట్రాలు నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీ స్థాయిలో ఉద్యోగాలు..!!

Telugu States in jobs : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి Y.S. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరుస నోటిఫికేషన్ లు ఇస్తూనే ఉన్నారు. అయితే తాజాగా వైద్య శాఖలో ఖాళీగా ఉన్న 2,588 పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు, ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో.. ఆ విషయాలను త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసి తెలియజేస్తున్నట్లు గా తెలియజేశారు. అయితే ప్రస్తుతం ఇందులో ఖాళీగా ఏఏ పోస్టులు ఉన్నాయి.. ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.

Telugu States Good news for the unemployed Large scale jobs
Telugu States Good news for the unemployed Large scale jobs

ఆంధ్రప్రదేశ్ లో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఆస్పత్రిలో కొత్తగా..2,588 పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఇందులో ముఖ్యంగా..

1).446-సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు కలవు.
2).6-డిప్యూటీ డెంటల్ సర్జన్ పోస్టులను శాశ్వత ప్రతిపాదికంగా భర్తీ చేయనున్నారు.
3).74-ఫార్మసిస్ట్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
4).74-బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ కింద ప్రతిపాదనతో నియమించనున్నారు.
5).57-స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
6).235- ల్యాప్ టెక్నికల్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

ఇక ఇతర సేవల కింద 279 – థియేటర్ అసిస్టెంట్ పోస్టులు, 365-పోస్టుమార్టం అసిస్టెంట్ పోస్టులు, 52- కౌన్సిలర్ పోస్టులు, 49 -హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పోస్టులు, 684 -జనరల్ డ్యూటీ అటెండెన్స్, 50-ప్లంబర్ పోస్టులు, 50-ఎలక్ట్రిషన్ పోస్టులను పొరుగు సేవల కింద భర్తీ చేయనున్నట్లు తెలియజేశారు. ఇక వీటిలో పదవ తరగతి ఉత్తీర్ణత,ITI విద్యార్హత మరికొన్ని పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఈ పోస్టులకు సంబంధించి పూర్తి వివరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ను వెలువడనున్నట్లు తెలియజేసింది.అయితే ఎవరైనా ఆసక్తికరంగా ఉండే అభ్యర్థులు.. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత, నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఇది ఒక చక్కటి అవకాశం లాంటిదని చెప్పవచ్చు.