5G Recharge Plans : ప్రస్తుతం మన దేశంలో ఎక్కడ చూసినా సరే 5G టెలికాం సర్వీసుల కోసం ఎదురు చూసే వినియోగదారుల సంఖ్య ఎక్కువ అవుతుంది . ఇకపోతే వినియోగదారులు ఆరంభంలోనే అదిరిపోయే ప్రయోజనం పొందనున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ ఆరంభ దశలో టారిఫ్లను పెంచకుండానే యూజర్లకు 4G ధరలలోనే 5G సర్వీసులను అందించే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం 5G నెట్వర్క్ కు సపోర్ట్ చేసే 5G స్మార్ట్ ఫోన్లు చాలా తక్కువ మంది దగ్గర ఉండడంతో అత్యధిక ఫోన్లకు 5G సామర్థ్యం లేకపోవడం వల్ల ఇలా 4G రీఛార్జ్ ప్లాన్స్ ధరలలో 5G రీఛార్జ్ ప్లాన్స్ ను అందించడానికి ఈ టెలికాం సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
ఇకపోతే ఇండియాలో ప్రస్తుతం 600 మిలియన్ స్మార్ట్ ఫోన్లలో కేవలం 8శాతం ఫోన్లు మాత్రమే 5G సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని , తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ఇక టెలికాం కంపెనీలు ప్రస్తుత 4G ప్లాన్లను అప్గ్రేడ్ చేసి 5G సర్వీసుల యాక్సిస్ ఇచ్చే అవకాశం ఉందని రిపోర్టు తెలిపింది. ఇకపోతే సిమ్ కార్డు మారాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది సాధ్యమేనని నెట్వర్క్ ను 4G నుంచి 5G కి పెంచితే సరిపోతుందని కూడా వివరణ ఇచ్చింది. ఇకపోతే గతంలో నెట్వర్క్ 3G నుంచి 4G నెట్వర్క్ కి మారాలనుకుంటే సిమ్ కార్డు కూడా మారాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు అలాంటి సమస్య లేదు కాబట్టి 4G నుంచి 5G కి అప్డేట్ అవ్వవచ్చు.
అక్టోబర్ , డిసెంబర్ నెలల మధ్యకాలంలో 5G సపోర్టెడ్ ఫోన్ల విక్రయాలు పెరగనున్నాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ రిపోర్ట్ తెలిపింది. ఇకపోతే ప్రస్తుతం 5G ఫోన్లు 14 శాతానికి లేదా 85 మిలియన్లకు పెరిగాయని విశ్లేషించింది. ఇక త్వరలోనే దీపావళికి ఇండియాలోని మెట్రో నగరాల్లో జియో 5G సేవలు ప్రారంభిస్తున్నామని జియో అలాగే ఎయిర్టెల్ కూడా ప్రకటించింది. ఇక 5G సర్వీసులో డేటా వినియోగించే వేగం 4Gసర్వీసుల కంటే అధికంగా ఉండనుంది. ఈ కారణంగా టెలికాం కంపెనీల యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్ పెరిగే అవకాశం కూడా ఉందని, కంపెనీలు అంచనా వేస్తున్నాయి. మరి ఇదే నిజమైతే ప్రస్తుతం కొన్ని రోజుల వరకు 5G సేవలను తక్కువ ధరకే పొందవచ్చు.