Tecno Camon 19 Pro : చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల తయారీ సంస్థ అయినటువంటి టెక్నో ఇప్పటికే రకరకాల స్మార్ట్ ఫోన్స్ లను అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే ఎక్కడ చూసినా 5G నెట్వర్క్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా 5జి మొబైల్ ని కొనుగోలు చేయాలని ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో టెక్నో నుంచి కూడా 5G స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రావడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది .ఈ క్రమంలోనే Tecno Camon 19 Pro 5G స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ లాంచింగ్ డేట్ ఎప్పుడు అనే విషయాలను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
Tecno Camon 19 Pro 5G స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ డైమన్సిటీ 810 SoC ప్రాసెసర్ తో పనిచేస్తుంది. అంతేకాకుండా అప్గ్రేడెడ్ కెమెరా ఫీచర్లు అలాగే 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో రానున్నట్లు సోషల్ మీడియా వేదికలుగా విడుదలకు సంబంధించిన అన్ని స్పెసిఫికేషనులను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. ఇక ఈ మొబైల్ కు 6.8 అంగుళాలతో 1080X2460 పిక్సెల్ రెజల్యూషన్ తో ఫుల్ హెచ్డి డిస్ప్లే ప్యానెల్ ను అందిస్తున్నట్లు సమాచారం. ఇక ఇది 120 HZ రిఫ్రిజిరేటుతో ఆండ్రాయిడ్ 12 ఆధారంగా రన్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే 8GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ కెపాసిటీతో రానున్నట్లు సమాచారం.
ఇక కెమెరా విషయానికి వస్తే ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో ప్రధాన కెమెరా 64 మెగా పిక్సెల్ క్వాలిటీతో RGBW+G+P 1/1.6 అపర్చల్ లెన్స్ ప్రైమరీ కెమెరాను అందిస్తున్నారు. ఇక మిగతా రెండు కెమెరాలు కూడా 2 మెగాపిక్సల్ క్వాలిటీతో మ్యాక్రో షాట్స్ లెన్స్ ఇస్తున్నట్లు సమాచారం. ఇక వీడియో కాలింగ్, సెల్ఫీ విషయానికి వస్తే 16 మెగాపిక్సల్ క్వాలిటీ గల లెన్స్ ఫ్రంట్ కెమెరా ను కూడా అందిస్తున్నారు. ఇక 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో లభిస్తుంది. ముఖ్యంగా డ్యూయల్ సిమ్ స్లాట్స్ రెండింటికి కూడా 5G నెట్వర్క్ సపోర్ట్ సిస్టం కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఆగస్టు 10వ తేదీన భారత మార్కెట్లో విడుదల కానున్న ఈ స్మార్ట్ మొబైల్ ధర 25 వేల రూపాయల ఉండొచ్చు అని సమాచారం.