Teaching Posts : తెలంగాణలోని నిరుద్యోగులకు తాజాగా ఆ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని విడుదల చేయబోతున్నట్లు గా పలు సందర్భాలలో తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా కేంద్రీయ విద్యాలయాల్లో CRPF భాస్కర్, హైదరాబాద్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఈ విద్యాలయంలో కాంట్రాక్ట్ ప్రతిపదికన కింద పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పోస్టులకు పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
నోటిఫికేషన్ తెలిపిన వివారాలలో ఇందులో PGT,TGT, ప్రైమరీ టీచర్, టిఆర్టి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కోచ్, తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇంగ్లీష్, హిందీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, సంస్కృతం, సోషల్ స్టడీస్, మ్యూజిక్ వంటి విభాగాలలో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు : ఈ పోస్టులకు అభ్యర్థులు అప్లై చేసుకోవాలనుకునేవారు.. గ్రాడ్యుయేషన్, డిప్లమా/డిగ్రీ/బి ఎస్సి/బ్యాచిలర్ డిగ్రీ, బిఈ/బీఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఇక వీరితో పాటుగా కంప్యూటర్ లో నైపుణ్యంతో పాటు అనుభవం కూడా ఉండాలి.
తెలుసుకోవలసిన విషయాలు : 1).అభ్యర్థులు అప్లై చేసేటప్పుడు వారికి సంబంధించిన అకాడమిక్ సర్టిఫికెట్ లతో పాటుగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
2). ఇంటర్వ్యూలను కేవలం హైదరాబాదులో బార్కస్ లోని కేంద్ర విశ్వవిద్యాలయం లోనే నిర్వహించనున్నారు.
3). అభ్యర్థులు ఇంటర్వ్యూ తేదీలను ఈనెల 8,9 తేదీలలో నిర్వహించనున్నారు https://hyderabadcrpf.kvs.ac.in/పూర్తి వివరాలను ఇక్కడ చూసుకోవాలి.
కేవలం ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అర్హత కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరు కావడం మంచిది. ఎవరైనా ఉపాధ్యాయ ఉద్యోగం కావాలనుకునే వారికి ఇది ఒక చక్కటి అవకాశం లాంటిదని చెప్పవచ్చు.