TDP.. ప్రముఖ జాతీయ పార్టీ టీడీపీ నేత ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఈరోజు సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆయన గత జనవరి నెలలో గుండెపోటుకు గురయ్యారు.. అప్పటినుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న ఈయన పరిస్థితి విషమించడంతో గత కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు. గత 2 నెలలుగా మృత్యువు తో పోరాడిన బచ్చుల అర్జునుడు ఆయనను బతికించేందుకు వైద్యులు కూడా శతవిధాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు.
బచ్చుల అర్జునుడు ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. జనవరి 28న ఆయన గుండెపోటుతో కుప్పకూలగా విజయవాడ రమేష్ ఆస్పత్రికి తరలించారు. ఆయనకు వైద్యులు స్టంట్ అమర్చారు. అప్పటి నుంచి ఐసీయూలోనే ఉన్నట్టు తెలుస్తోంది . రక్తపోటు నియంత్రణలోకి రాకపోవడంతో ఆయన పరిస్థితి విషమించినట్లు సమాచారం. కొన్ని నిమిషాల క్రితం తుది శ్వాస విడిచారు.