Adireddy Bhavani : ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి.. స్పీకర్ తమ్మినేని సీతారామన్ ఒక్కొక్కరికి అవకాశం ఇస్తూ.. వారి విలువైన సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఇక అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ శ్రీమతి ఆదిరెడ్డి భవానీ టర్న్ వచ్చింది.. ఇక మెంబర్ కి మైక్ ఇవ్వండి అంటూ స్పీకర్ చెబుతారు. అధ్యక్ష మనకి ఇప్పుడు మూడు సంవత్సరాల మూడు నెలల మూడు రోజుల క్రితం.. డిసెంబర్ నెల 2019లో మనకి ఇక్కడ దిశా బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది.. ఆరోజు కూడా నేను ఇక్కడ మాట్లాడాను ఒక మహిళగా నేను ఎంతో సంబరపడ్డాను. మంచి బిల్ వస్తుందని అనుకున్నాను.
ఈ చట్టం వస్తే మహిళలందరికీ భద్రత ఉంటుందని గట్టిగా నమ్మాను. కానీ నేను మాట్లాడిన మరుసటి రోజే నా పైన కూడా సోషల్ మీడియా పరంగా దాడి చేశారు. ఆ విషయాన్ని మీ దృష్టికి కూడా తీసుకువచ్చాను ఎప్పటికీ మూడు సంవత్సరాలు అయినా దానిపైన కూడా నాకు ఎటువంటి సమాచారం లేదు. మా ఊర్లో దిశ పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడి కూడా వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
మీరు గమనిస్తే గత మూడేళ్లుగా.. ప్రభుత్వం అనేకసార్లు సవరించాలని మనకి అనేకసార్లు చెప్పినా కూడా ఎలాంటి స్పందన లేదు. మనం ప్రతిష్టాత్మకంగా ఈ బిల్లు ప్రవేశపెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆరోజు చాలా భావోద్వేగంతో చెప్పారు. మహిళలకి అక్క చెల్లెలు అందరికీ కూడా ఈ చట్టం వస్తే ఎంతో మేలు చేస్తుంది అని.. ఇంతవరకు కూడా ఆ విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు అధ్యక్ష అని చెప్పారు.
ఈ చట్టం రాకుండా ఉరిశిక్ష పడింది అని చెబితే సరిపోదు కదా అధ్యక్ష .. కచ్చితంగా ఈ చట్టంలో తీసుకురావాలి. భావోద్వేగంతో ఈ చట్టాన్ని తీసుకువస్తున్నాం అని చెబితే సరిపోదు కదా.. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ చట్టం ఆమోదం అయ్యేలాగా చేయాలని కోరుకుంటున్నాను. దిశా చట్టం కింద ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదు అయితే ఎంతవరకు మీరు క్లారిటీ చేశారు అనేది కూడా వివరణ ఇవ్వాలని ఆదిరెడ్డి భవాని కోరారు. ఇది రాజకీయంగా మభ్యపెట్టే కార్యక్రమం గానే ఉంది కానీ ఎలాంటి క్లారిటీ లేదు అందుకని దిశా చట్టం పై కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి ఈ బిల్లును ఆమోదించాలని ఆమె కోరారు.