Yuvagalam : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర జోరుగా సాగుతోంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలలో సత్తా చాటడంతో పార్టీ నాయకులకు క్యాడర్ ఫుల్ సంతోషంగా ఉన్నారు. వైసిపి బలంగా ఉండే రాయలసీమ ప్రాంతాలలో కూడా టీడీపీ గెలవడంతో… ఎన్నికలలో గెలిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రత్యేకంగా చంద్రబాబు అభినందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ముందు రాజకీయ ముఖచిత్రం ఒకలా ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టీడీపీ క్యాడర్ నూతన ఉత్సాహంతో ఉంది. దీంతో లోకేష్ పాదయాత్రలో కార్యకర్తలు ఫుల్ జోష్ లో ఉన్నారు. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రస్తుతం పుట్టపర్తి జిల్లాల్లో కొనసాగుతుంది. సోమవారం కదిరి నియోజకవర్గం లో ఎంట్రీ ఇచ్చారు.
అయితే లోకేష్ పాదయాత్రకీ యువత బ్రహ్మరథం పడుతుంది. ఈ క్రమంలో లోకేష్ నడుస్తూ ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ అభిమాని ఒక్కసారిగా లోకేష్ చుట్టూ ఉన్న భద్రత వలయాన్ని దాటుకుని కాలు మీద పడ్డాడు. లోకేష్ సదరు కార్యకర్తలు లేవనెత్తి ఉంటుండగా ఒక్కసారిగా ఆ కార్యకర్త లోకేష్ చెయ్యి రావటంతో చుట్టూ క్యాడర్ షాక్ అయింది. ఈ పరిణామంతో లోకేష్ కొంత అబద్ధపు గురయ్యాడు. సదరు కుర్రవాడిని కార్యకర్తలు గట్టిగా లాగడంతో లోకేష్ చెయ్యి అతని చేతిలో ఉండటంతో భుజం ఒక్కసారిగా మెలికి పడింది. వెంటనే తేరుకుని సదర్ కార్యకర్తని దగ్గర తీసుకుని లోకేష్ మాట్లాడటం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పాదయాత్ర లోకేష్ గతంలో మాదిరిగా కాకుండా చాలా తెలివిగా రాణిస్తున్నాడు. ప్రభుత్వ వ్యతిరేకత విధానాలను తనదైన శైలిలో లేవనెత్తుతూ సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా పరిస్థితిని వివరిస్తున్నారు. లోకేష్ పాదయాత్రకి అడుగడుగునా మహిళలు మరియు యువత బ్రహ్మ రథం పడుతోంది. రాయలసీమ ప్రాంతంలోనే లోకేష్ పాదయాత్ర ఈ రీతిగా ఉంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే జిల్లాలలో… పాదయాత్రకి మరింత క్రేజ్ పెరుగుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర ఇవ్వాళ్టికి 49వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలోని కదిరి అసెంబ్లీ నియోజకవర్గం మీదుగా సాగుతున్నారాయన.