Tarakaratna.. నందమూరి హీరో తారకరత్న అతి చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం జరిగింది. అయితే తారకరత్న చనిపోయినప్పటి నుంచి ఆయనకు సంబంధించి ఏదో ఒక విషయం వైరల్ గా మారుతూనే ఉంది. ముఖ్యంగా నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రను దగ్గరుండి చూసుకున్న తారకరత్న ఆ పాదయాత్రలో పాల్గొన్న మొదటి రోజు గుండెపోటుతో కింద పడిపోవడం జరిగింది. ఇక అప్పటినుంచి ఆయనని బెంగళూరులోని హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.
అయితే దాదాపుగా 23 మూడు రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నా.. ఎలాంటి మార్పు రాలేదు. దీంతో చివరికి తృది శ్వాస విడిచారు .కాగా ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు బాలయ్య తారకరత్నను దగ్గరుండి చూసుకున్నారని వార్తలు వినిపించాయి. ముఖ్యంగా తారకరత్న బిల్లు కూడా చంద్రబాబు నాయుడు, బాలయ్య భరించారని వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై లక్ష్మీపార్వతి క్లారిటీ ఇస్తూ తారకరత్న ఆసుపత్రి బిల్లు మొత్తం విజయసాయిరెడ్డి కట్టారంటూ తెలియజేయడం జరిగింది. నందమూరి కుటుంబం అసలు బిల్లే కట్టలేదంటూ అందులో నిజం లేదంటూ తెలియజేసింది. కేవలం విజయ్ సాయి రెడ్డి ఒక్కడే ఆ మొత్తాన్ని భరించారని తెలిపింది.