News about Mathaji : మొగుడు వద్దని ప్రియుడే ముద్దని ఓ మహిళ వెళ్లిపోయింది. తన వాదనను టీవీ చానళ్లలో వినిపించింది. ఆమె ఏడేళ్ల తర్వాత ఆదిపరాశక్తి పేరుతో భక్తుల ముందుకు వచ్చింది. కానీ ఆమె కోసం ఇప్పుడు పోలీసులు గాలిస్తున్నారు. తమిళనాడును షేక్ చేస్తున్న ఈ మహిళ కన్నింగ్ కథ అప్పట్లో సంచలనం సృష్టించింది. తమిళనాడులో ఇప్పుడు ఓ కొత్త అమ్మ సంచలనం సృష్టిస్తున్నారు. ఆమె రాజకీయ అమ్మ కాదు. తనను తాను స్వయం ప్రకటిత ఆదిపరాశక్తిగా ప్రకటించుకున్న అమ్మ. అయితే చూపించిన మహిమలను చూసి ప్రజలు ఆమె దగ్గరకి తండోప తండాలుగా తరలి వస్తున్నారు. కాగా ఆమె బ్యాక్ గ్రౌండ్ చూసి… కళ్లు బైర్లు కమ్మాయి. ఆమె ఆదిపరాశక్తి అంటే మరో కోణంలో నమ్మాల్సిందేనని సైటైర్లు వేస్తున్నారు.
ఆ మాతాజీ భర్తని వదిలేసి ప్రియుడితో పరారైన రకం. ఆమె ఆదిపరాశక్తినని ప్రకటించుకుని తనను తాను మార్కెటింగ్ చేసుకుంటోంది. చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూర్ లోని ఓ కల్యాణ మండపం వేదిక అన్నపూర్ణి అరసు మాతాజీ జనవరి ఒకటిన దివ్య దర్శనం ఇవ్వనున్నారని.. భక్తులకు ఉపదేశం చేయనున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. మాతాజీ చుట్టూ భక్తులు ఆశీర్వచనాలు తీసుకోవడం, క్షణాల్లో ఆమె పూనకం వచ్చినట్టు ఊగి పోతు.. భక్తుల కోరికల్ని తీర్చడం, వరాలు ఇవ్వడం వంటి అనేక వీడియోలు యూట్యూబ్ లో చక్కర్లు కొడుతున్నాయి.
కాగా ఒక భక్తుడు ఈ అమ్మ ముఖం ఎక్కడో చూసినట్లుగా ఉందే అని చాలా మందికి అనిపించింది. వెంటనే సెర్చ్ చేశారు. అంతే… ఆమె జాతకం బయటకు వచ్చేసింది. 2014లో ఓ టీవీ ఛానల్ వేదికగా జరిగిన చర్చలో తనకు భర్త, 14 ఏళ్ల కుమార్తె కన్నా, ప్రియుడు అరసే ముఖ్యం అని స్పష్టం చేసి అతడితో వెళ్లి పోయిన మహిళే ఈ అన్నపూర్ణేశ్వరి. భర్త, కుమార్తెను వదిలి ప్రియుడే కావాలని రచ్చకెక్కిన ఓ మహిళ తాజాగా తాను ఆది పరాశక్తి అవతారం అని చెప్పుకుంటూ.. తెర మీదకు రావడం స్థానికులను విస్మయంలో పడేసింది.
భర్తను వదిలేసింది ప్రియుడే కావాలంటే వెళ్లింది. ఆ ప్రియుడేమయ్యాడు అని కొంత మంది ఆరా తీశారు. అయితే ప్రియుడు అరసు అనుమానాస్పదంగా గతంలో మరణించినట్టు తేలింది. దీంతో పోలీసులు ఎంటరయ్యారు. దీంతో ఈ వివాదాస్పద మాతాజీ అదృశ్యమయ్యారు. కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న నిర్వాహకులు, తమ సెల్‌ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి వెళ్లిపోయారు. పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మాతాజీని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి మాతాజీ లను నమ్మి మోసపోవద్దు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.